Elephant Burials : పిల్లలను ఖననం చేసే ఆచారాన్ని ఏనుగులు పాటించాయా.. కొత్త అధ్యయనంలో నిజాలు..!

ఏనుగులు( Elephants ) చాలా తెలివైన జంతువులు.వాటికి ఎమోషన్స్ కూడా ఉంటాయి.

కొన్నిసార్లు, అవి పిల్లలు చనిపోయినప్పుడు, వాటిని తండాలలో మూసుకుంటూ తమతో పాటే చాలాకాలం తిప్పుకుంటాయి.ఎందుకంటే అవి వాటిని చనిపోయాక కూడా వదిలిపెట్టలేవు.

అయితే ఈ ఏనుగులకు సంబంధించిన మరొక భావోద్వేగ విషయం తెలిసింది.భారతదేశానికి చెందిన కొందరు పరిశోధకులు ఆసియా ఏనుగుల( Asia Elephants ) గురించి కొత్త విషయాన్ని కనుగొన్నారు.

వారు జర్నల్ ఆఫ్ థ్రెటెడ్ టాక్సా అనే పత్రికలో ఒక పేపర్ రాశారు.చనిపోయిన తమ పిల్లలకు వీడ్కోలు పలికేందుకు ఆసియా ఏనుగులు ప్రత్యేక పద్ధతిని కలిగి ఉన్నాయని వారు చెబుతున్నారు.

Advertisement

ఏనుగులు చనిపోయిన తమ పిల్లలను ప్రజలకు దూరంగా తీసుకెళ్లి ఒకచోట గుంత తవ్వుతాయని, ఆపై పిల్ల మృతదేహాన్ని గుంతలో వేసి కప్పివేస్తాయని చెప్పారు.ఎల్లప్పుడూ పిల్లల కళేబరాన్ని తలకిందులుగా ఉంచి పూడ్చి పెడతాయని వారు తెలుసుకున్నారు.

గతంలో ఆఫ్రికన్ ఏనుగులు( African Elephants ) ఇలాంటి పనులు చేశాయని తెలిసింది.కానీ ఆసియా ఏనుగులు కూడా ఇలా చేయడం, చూడటం ఇదే తొలిసారి.

ఈ విషయాలను తెలుసుకోవడానికి పరిశోధకులు కెమెరాలు, నివేదికలు, పరీక్షలను ఉపయోగించారు.ఉత్తర బెంగాల్‌లోని అడవులు, పొలాలు, తేయాకు తోటలు, సైనిక శిబిరాలు ఉన్న ప్రదేశాలను వారు పరిశీలించారు.ఐదు ఏనుగు పిల్లలను ఇలానే ఖననం చేయడాన్ని వారు చూశారు.

పరిశోధకులలో ఒకరైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన పేపర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.భారతదేశం నుంచి ఈ రకమైన అధ్యయనం ఇదే మొదటిదని ఆయన అన్నారు.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..

ఆసియా ఏనుగు ఖననాలను( Elephant Burials ) చాలా మంది వినలేదని లేదా చూడలేదని ఆయన అన్నారు.కానీ ఇది నిజమని చెప్పడానికి తమ పేపర్‌లో చాలా చిత్రాలు, ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Advertisement

చనిపోయిన పిల్లలను ఏనుగులు తొండం లేదా కాళ్లతో మోసుకెళ్లడం తాము చూశామని ఆయన చెప్పారు.ఇలా చేసినప్పుడు వాటిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదని అన్నారు.పసి ఏనుగు పిల్లను( Baby Elephant ) పట్టుకుని అవి ఒక భూమి రంధ్రంలో ఉంచాయని తెలిపారు.

బిడ్డల పట్ల ఎంత ప్రేమగా, శ్రద్ధగా అవి ఉంటాయో దీన్ని బట్టి తెలిసిందని తెలిపారు.శవాన్ని మొత్తం ఖననం చేసేందుకు స్థలం సరిపోకపోయి అవి మొదట తలను, తరువాత పాదాలను పాతిపెట్టి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆసియా ఏనుగులు పిల్లలను పాతిపెట్టిన ప్రదేశాల దగ్గరికి వెళ్లలేవు.కానీ ఆఫ్రికన్ ఏనుగులు తమ పిల్లలను పాతిపెట్టిన ప్రదేశాల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడతాయి.వాటిని చూస్తూ ముట్టుకుంటూ కాలం గడుపుతున్నారు.

తాజా వార్తలు