అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్‌పై టిక్‌టాక్‌ కుట్ర.. రిపబ్లికన్ సెనేటర్ల సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నిలకు సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో ట్రంప్ విజయంలో రష్యా జోక్యం చేసుకున్నట్లుగా ఆరోపణలు రావడం అమెరికాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.ఈసారి ఎన్నికల్లో కూడా చైనా తనను ఓడించేందుకు కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తూ వస్తున్నారు.

తాజాగా రిపబ్లికన్‌ పార్టీకే చెందిన పలువురు సెనేటర్లు చైనా దిగ్గజం టిక్‌టాక్‌పై సంచలన ఆరోపణలు చేశారు.టిక్ టాక్ యాప్ ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటుందేమోనని వారు ఆరోపించారు.

తద్వారా ట్రంప్‌ను ఓడించేందుకు కుట్రలు జరగవచ్చని థామ్ టిల్లీస్, టామ్ కాటన్, కెవిన్ క్రామర్, టెడ్ క్రూజ్, జారి ఎర్రెస్ట్, మార్కో రూబియో, రిక్ స్కాట్‌లు వ్యాఖ్యానించారు.ఈ కారణం వల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల సమగ్రత, భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాక్ రాట్‌క్లిఫె, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిష్టోఫర్ రే, హోంలాండ్ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాంద్ వూల్ఫ్‌కు ‌వారు లేఖ రాశారు.

Advertisement

అమెరికాలో కోట్లాది మంది టిక్ టాక్ వాడుతున్నారని.ఆ యాప్ ద్వారా ట్రంప్‌కు వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేయవచ్చని రిపబ్లికన్ సెనేటర్లు అనుమానం వ్యక్తం చేశారు.మరోవైపు భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లుగానే.

అమెరికాలోనూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్ సాయంతో గూఢచర్యం జరుగుతోందని 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా యాప్స్‌పై నిషేధం విధించాలని ట్రంప్‌కు లేఖ రాశారు.

అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..
Advertisement

తాజా వార్తలు