తెలంగాణలో టి కాంగ్రెస్( Telangana congress ) యమ దూకుడు ప్రదర్శిస్తోంది.నార్త్ రాష్ట్రాలతో పోల్చితే ఈసారి హస్తం పార్టీ దృష్టి సౌత్ రాష్ట్రాలపైనా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
జాతీయ నేతలు కూడా సౌత్ నేతలు ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు.ఇక ఇప్పటికే కర్నాటకలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ఎలాగైనా అధికారంలోకి రావాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.అందుకోసం అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది హస్తం పార్టీ.

కాంగ్రెస్ అత్యున్నత సమావేశాలైన సిడబ్ల్యూసి సమావేశాలను చాలా ఏళ్ల తరువాత హైదరబాద్ లో ఇటీవల నిర్వహించారు.ఈ సమావేశాల్లో చాలా అంశాలపైనే ఫోకస్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీల రూపకల్పనలోనూ వాటిని ప్రకటించడంలో హస్తం హైకమాండ్ సక్సస్ అయిందనేది కొందరి అభిప్రాయం.తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఐదు హామీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఐదు లక్షల ఇంటి స్థలాలు, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా రూ.15000 అలాగే వ్యవసాయ కూలీలకు రూ.12000, మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెల రూ.2500, అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇంకా మహిలలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువ వికాసం పేరుతో విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు.చేయూత పథకం ద్వారా ప్రతినెలా రూ.4000 పెన్షన్ ఇలా హామీల వర్షం కురిపించింది హస్తం పార్టీ.

అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఈ హామీలన్నీ కర్నాటక( Karnataka )లో ప్రకటించిన హామీలే.ఇందులో పెన్షన్, రైతు భరోసా వంటి పథకాలను బిఆర్‌ఎస్ సర్కార్ ఇప్పటికే అమలు చేస్తోంది.దీంతో కాంగ్రెస్ హామీలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనేది ప్రశ్నార్థకమే.
అయితే ఈ హామీలు కర్నాటకలో ప్రజలను గట్టిగానే ఆకర్షించాయి.దానికి కారణం అక్కడ బీజేపీ సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేక.
కానీ తెలంగాణలో బిఆర్‌ఎస్( BRS ) ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో కర్నాటక వ్యూహం హస్తం పార్టీని ఎంతవరుకు గట్టెక్కిస్తుందో చూడాలి.