అఫిషియల్‌ : 18 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్‌ టాలీవుడ్‌ వెండి తెరపై

రేణు దేశాయ్.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన ఈమె తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చి 18 సంవత్సరాలు పూర్తయింది.ఆ మధ్య మరాఠా సినిమాను తెరకెక్కించి, నటించిన కూడా తెలుగు వెండి తెరపై మాత్రం ఈమె కనిపించలేదు.

ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.టైగర్ నాగేశ్వరరావు సినిమా లో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుందంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.ఒక పేరు మోసిన నిజమైన దొంగ అయిన నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

మొదట ఈ సినిమా కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయాలనుకున్నారు, అందులో కూడా రేణు దేశాయ్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.

టైగర్ నాగేశ్వరరావు పై ఆసక్తి చూపించడంతో దర్శకుడు వంశీ మాస్ రాజా తో టైగర్ నాగేశ్వరరావు మొదలు పెట్టాడు.మొదటి నుండే హేమలత లవణం పాత్రకు రేణు దేశాయ్ అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడు.అందుకే రవితేజ స్వయంగా రేణు దేశాయ్ తో మాట్లాడి ఒప్పించినట్లుగా తెలుస్తుంది.18 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు పై అంచనాలు భారీగా ఉన్నాయి.పవన్ కళ్యాణ్ తో బద్రి మరియు జానీ సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత పవన్ నటించిన కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.పవన్ కళ్యాణ్ తో విడి పోయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.

మరాఠా సినిమాలో ప్రయత్నించినా కూడా పెద్దగా సక్సెస్ దక్కలేదు.ఎట్టకేలకు సన్నిహితుల కోరిక మేరకు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

Advertisement

తాజా వార్తలు