పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేసిన నిర్మాత సురేష్ బాబు..మరీ ఇంత మోసమా!

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో గీత ఆర్ట్స్ సంస్థ ద్వారా నెల జీతం చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా వంద కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే రేంజ్ ఎదిగాడు.

 Remuneration Issues Between Pawan Kalyan And Producer Suresh Babu Details, Remun-TeluguStop.com

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన సొంత కష్టం మీద ఈ స్థాయికి వచ్చాడు.ఆయన ఒక్క రోజు కాల్ షీటు విలువ రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు ఉంటుంది.

లేటెస్ట్ గా నటించిన ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) చిత్రం కి గాను పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు.ఆ 30 రోజులకు గాను ఆయన 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

ఇక తర్వాత చేస్తున్న #OG చిత్రం కోసం 100 కోట్ల రూపాయిలు తీసుకునే రేంజ్ కి వచ్చేసింది.

Telugu Bro Avatar, Gopala Gopala, Pawan Kalyan, Pawan, Suresh Babu-Movie

పాన్ ఇండియన్ మార్కెట్ లేకుండా ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు ఇండియన్ సూపర్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒక్కడు.అయితే పవన్ కళ్యాణ్ కొంత మంది నిర్మాతలు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా , రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.బండ్ల గణేష్, bvsn ప్రసాద్ తదితరులు ఇలా చేసారు.

కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ తన సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కి ఇచ్చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి.అయితే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం తర్వాత ‘గోపాల గోపాల’ ( Gopala Gopala ) అనే సినిమా చేసాడు.

ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆయన ఎంతో చక్కగా నటించాడు.శ్రీ కృష్ణుడి పాత్రలో ఒదిగిపోయి చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ తో తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

Telugu Bro Avatar, Gopala Gopala, Pawan Kalyan, Pawan, Suresh Babu-Movie

అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నెల రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు, ఆ తర్వాత అదనంగా మరో 15 రోజుల కాల్ షీట్స్ సురేష్ బాబు( Producer Suresh Babu ) అడిగితే ఇచ్చాడు.కానీ అది కూడా సరిపోక సురేష్ బాబు మరికొన్ని రోజులు కాల్ షీట్స్ కోరాడట.ఈ అదనపు కాల్ షీట్స్ కి ముందు కమిట్ అయ్యి ఉన్న పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని అగ్రిమెంట్ లో ఉందట.కానీ సురేష్ బాబు మాత్రం ముందు కమిట్ అయినా పారితోషికమే ఇస్తాను, కాస్త బడ్జెట్ ఎక్కువ అయ్యింది అన్నాడట.

ఈ విషయం లో పవన్ కళ్యాణ్ మరియు సురేష్ బాబు మధ్య కొంత కాలం గొడవ జరిగింది.చివరికి పవన్ కళ్యాణ్ ఒప్పుకొని సురేష్ బాబు ఇచ్చినంత రెమ్యూనరేషన్ తీసుకొని, ఆ తర్వాత ఆయన సురేష్ బాబు తో మాట్లాడడం మానేసాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube