మిర్చి పౌడర్ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి

వంట ఇంట్లో కారం లేదని ఏ పని అవ్వదు.ఏ కూర చేయలన్నా కారం తప్పసరిగా ఉండాల్సిందే.

 Remember These Things While Buying Chilli Powder Details, Mirchi Powder, Buying,-TeluguStop.com

కారం లేకపోతే కర్రీకి టేస్ట్ రాదు.నాలుకకు కారం తగలకపోతే కర్రీ టేస్ట్ అనిపించదు.

అందుకే మిర్చి పౌడర్ లేకుండా ఏ కర్రీ వండరు.వంట ఇంట్లో ఉప్పు, పసుపు, పప్పు దినుసులు, మసాలా దినుతులు ఎంత ముఖ్యమై.

చిల్లీ పౌడర్ కూడా అంతే ముఖ్యం.రెడ్ చిల్లీ పౌడర్ వంటి ఇంట్లో నిత్యావసర వస్తువు అని చెప్పవచ్చు.

వంటగదిలో చిల్లీ పౌడర్ ముఖ్యమైన వస్తువు.

వెజ్, నాన్ వెజ్.

ఇలా ఏ కర్రీ చేసినా.కారం లేకపోతే చప్పగా ఉంటుంది.

రెడ్ చిల్లీ పౌడర్ నోటికి రుచి అనిపించదు.పప్పులతో వండే కర్రీల నుంచి నాన్ వెజ్ వరకు ప్రతిదానితో మిర్చి పౌడర్ ఉపయోగిస్తారు.

ఒకప్పుడు మిర్చి పౌడర్ కావాలంటే ఎర్ర మిరపకాయాలను రోటిలో వేసి రుచ్చివాళ్లు.ఆ తర్వాత ఆ పౌడర్ ని డబ్బాల్లో ఉంచుకుని వంట గదిలో పెట్టుకుని వాడేవారు.

అయితే ఇప్పుడు అలా ఎవరూ చేయడం లేదు.మార్కెట్ లో ప్యాకెట్లలో దొరికే చిల్లీ పౌడర్ ను మాత్రమే వంటలకు ఉపయోగిస్తున్నారు.

చాలా కంపెనీలు రెడ్ చిల్లీ పౌడర్ ను తయారుచేస్తూ మార్కెట్ లో విక్రయిస్తున్నాయి.పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి.

అయితే మార్కెట్ లో దొరికే మిర్చి పౌడర్ ప్యాకెట్లను నమ్మడానికి వీలు లేదు.అవి నాసిరకంగా ఉండవచ్చు.కొన్ని నకిలీవి కూడా ఉంటాయి.

Telugu Chilli Powder, Chillipowder, Mirchi Powder, Tips Important, Latest-Latest

ఈ ప్యాకెట్లలో దొరికే రెడ్ చిల్లీ పౌడర్ ను కర్రీలో వేసుకుంటే రుచి కూడా సరిగ్గా ఉండదు.అందుకే మిర్చి పౌడర్ ను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.కల్తీ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

రెడ్ చిల్లీ పౌడర్ లో ఎక్కువ లాభం పొందటానికి పలు పదార్థాలు, రసాయనాలను కలుపుతారు.రంగు కోసం ఇటుక, రంపపు పొడి కలుపుతారు.

ఇక సుద్ద పొడి, ఊక, సబ్బు, ఎర్ర మట్టి కలుపుతారు.

ఒక గ్లాస్ నీటిని తీసుకోండి.

తర్వాత దానికి 1 టీ స్పూన్ ఎర్ర మిరప పొడిని కలపండి.నీటి ద్వారా మిర్చిలో అవశేషాలను పరీక్షించండి.

చేతులకు రాసుకుని చర్మం గురుకుగా అనిపిస్తే.అందులో ఇటుక పొడి కలిపినట్లు అర్థం చేసుకోండి.

పౌడర్ మీ చేతల్లో సబ్బు లాగా స్మూత్ గా అనిపిస్తే అందులో సబ్బు భాగాలు మిక్స్ అయ్యాయని అర్థం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube