ప్రశాంత దేశంలో మత చిచ్చు

విశ్వంలో ప్రశాంతత కలిగిన దేశం యునైటెడ్ కింగ్ డం.ఈ దేశం వాయవ్య ఐరోపా లో ఉంది.

 Religion In A Peaceful Country , Religion,peaceful Country ,united Kingdom,great-TeluguStop.com

గ్రేట్ బ్రిటన్ ను ఉత్తర ఐర్లాండ్ ను కలిపి యునైటెడ్ కింగ్ డంగా వ్యవహరిస్తారు.గ్రేట్ బ్రిటన్ లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్,హిల్ ఆఫ్ మ్యాన్, ఛానెల్ ఐర్లాండ్ ఉన్నాయి.

ఈ దేశం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన దేశం.ఇది మిక్కిలి పారిశ్రామిక దేశం.

ఉత్తర ఐర్లాండ్ లోని ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.రసాయనాలు,యంత్రాలు ఎగుమతులు.పెట్రోలియం, ఆహార పదార్థాలు దిగుమతులు.రాజధాని లండన్.రెండు సభలు ఉన్నాయి .ఒకటి హౌస్ ఆఫ్ కామన్స్, రెండవది హౌస్ ఆఫ్ లార్డ్స్.ఇంగ్లండ్ లో ప్రధాన నగరాలు అయినటువంటి లీ సేస్ట ర్ షైర్,బర్మింగ్ హమ్ నగరాలలో మత ఘర్షణలు రేగడం శోచనీయం.ఇంగ్లండ్ లో ఎప్పుడు అటువంటి మత చిచ్చు రగుల్కొలేదు.

అయితే ఒక్కసారిగా మత ఘర్షణలు జరగడం, హిందూ దేవాలయాల పై దాడులు జరగడంతో అక్కడి మహిళలు బ్రిటన్ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.బ్రిటన్ లోని లీ సేస్టర్,బర్మింగ్ ప్రాంతాల్లో హిందువులు ఎక్కువ.

వారితో అక్కడి పౌరులు మమేకమైనారు.భారతీయులతో కలసి,మెలసి ఉంటున్నారు.

మరో విషయం లీ సే స్టర్ ను “హిందూ రాష్ట్రంగా అక్కడి ప్రజలు పిలుచుకుంటారు.యూరోప్ లోనే అత్యధిక హిందు జనాభా ఉన్న నగరం.

ప్రజలు ఐకమత్యంతో,ఎంతో సామరస్యంగా ఉంటారు.

మతాలు వేరైనా,దేశాలు వేరైనా మానవత్వానికి విలువ ఇచ్చే నగరంగా అది పేరు పొందింది.

సహాయ సహకారాలు కూడా ఆ నగర వాసులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు.బ్రిటన్ చరిత్రలోనే ఇటువంటి మత చిచ్చు రగలడం అక్కడి ప్రజలను,ప్రభుత్వాన్ని కలవర పరుస్తోంది.దీనికి కారణం ఏమిటి అని ఆరా తీస్తోంది అక్కడి ప్రభుత్వం. హిందు దేవాలయాలపై ,హిందువుల పై దాడులు ఇటీవల ఆ నగరాలలో పెచ్చరిల్లుతున్నాయి.

గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తలేదు.లీ సే స్టర్ లో చూస్తే అక్కడి హిందు దేవాలయాలు ఎంతో సుందరమైనవి.

ప్రతి పండుగ అక్కడ హిందువులు దేవాలయాలలోకి వచ్చి ఆప్యాయంగా పలకరించి ప్రసాదాలు కూడా ఇవ్వడం చేస్తుంటారు.భారత్ లో లాగానే అక్కడ పండుగలు అంగరంగవైభవంగా,సామరస్యంగా జరుపుకుంటారు.

ఇంతటి సామరస్యం,ప్రశాంతంగా ఉన్న ఈ నగరంలో మత చిచ్చు రేగడం అమానుషం.ఇది బ్రిటన్ ప్రభుత్వానికి ఆ దేశ ఔన్నత్యానికి దెబ్బ.

ఎన్నో ఏళ్ల నాటి ప్రశాంతత చోటు చేసుకున్న నగరంలో మత ఛాందస వాదులు దాడులు చేస్తారేమోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.ఈ దాడుల పరంపర చిన్నగా ప్రక్కనే ఉన్న కెనడా కు కూడా పాకడంతో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ కోరింది.

అయితే కెనడాలో చెప్పుకోదగ్గ మత దాడులు లేవు.దీనికి ప్రధాన కారణం ఏదని తరచి చూస్తే భారత్,పాక్ ల మధ్య ఇటీవలే దుబాయ్ లో నిర్వహించబడిన ఆసియా క్రికెట్ కప్ మ్యాచ్ అని తెలుస్తోంది.

కాని వాస్తవంగా అది కాదని కొందరు చెబుతున్నారు.

Telugu Hindutemples, Birmingham, England, Britain, Leicestershire, Peaceful, Kin

మరికొందరు ఆసియా కప్ లో భారత్, పాక్ పై ఓసారి గెలిచి,కీలకమైన మరో మ్యాచ్ లో ఓడింది.మొదటిసారి హిందువులలో అత్యుత్సాహం తో వీధుల వెంట తిరిగి హంగామా సృష్టించారని భోగట్టా.మరోసారి భారత్ ,పాక్ పై ఓడింది.

ఇదే అదనుగా కొందరు మత ఛాందస వాదులు రెచ్చి పోయి హిందువులపైన,హిందు దేవాలయాల పైన దాడులకు తెగ బడ్డారని, ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని భారతీయులు నిరసన వ్యక్తం చేశారు.ఎంతో ప్రశాంతంగా ఉన్న లీ సే స్టర్ లో మత చిచ్చులో పడింది.

ఇక్కడ మాకు ఎటువంటి ద్వేషాలు లేవు.అందరూ ఐక్యంగా ఉన్నాం అని హిందువులు,మహమ్మదీయులు చెప్పడం గమనార్హం.

ఎవరో కొందరు మత శక్తుల వలన ,వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి యస్.జై శంకర్ కూడా అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.భారతీయులు ఎక్కడ ఉన్నా దాడులు చేయడం,ఆస్తులు ద్వంసం చేయడం, ముఖ్యంగా ఏ మతం వారి పైన దాడులు చేయడం,హింసించడం చేయరు.

హిందు రాష్టంగా పేరు పడ్డ లీ సే స్టర్ అటువంటి పరిస్థితి ఏర్పడటం ఊహించలేము.సోదర భావంతో ఒకరికొకరు ఆనందంగా,ప్రశాంతంగా ఉన్న లీ సే స్టర్, బర్మింగ్ హమ్ ఇప్పుడు మత విద్వెషపు కొరలలో చిక్కుకున్నాయి.

ముఖ్యంగా లీ సే స్టర్.బ్రిటన్ దేశంలోనే అందమైన నగరంగా లీ సే స్టర్ పేరు గాంచింది.

ఇక బర్మింగ్ హమ్ లో కూడా మత దాడులు జరుగుతున్న లీ సే స్టర్ అంత లేవు.సామరస్యం, సహకారంతో మనం ఎక్కడ ఉన్నా ముందుకు పోవాలి.

సోదరభావం తో మెలగాలి.ఏ దేశ పౌరులయినా మనందరం ఒక్కటే అనే ధోరణి ఉండాలి.

లీ సే స్టర్ లో దాడులు చేసింది ఓ వ్యతిరేక వర్గం వారే నని, ఇద్దరిని సమన్వయం పరుస్తూ మత సామరస్యంతో ఇరువురు మెలగాలని,సహకరించు కోవాలని అక్కడి అధికారులు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఈ మత దాడులు ఆగిపోవాలని లీ సే స్టర్,బర్మింగ్ హమ్ లో మళ్ళీ మత సామరస్యం ఉండాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube