రేవంత్‌ బెయిల్‌ కంటిన్యూ

నోటుకు ఓటు కేసులో నిందితుడైన కొడంగల్‌ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని జైల్లోనే కంటిన్యూ చేయాలనే తెలంగాణ ఏసీబీ ప్రయత్నం ఫలించలేదు.

రేవంత్‌కు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన ఏసీబీకి చుక్కెదురైంది.

దాని పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది.నోటుకు ఓటకు కేసులో తమ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో నిందితుడు బయట ఉండటం తగదని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఏసీబీ తన పిటిషన్లో పేర్కొంది.

సుప్రీం కోర్టుకు అందులో హేతుబద్ధత కనబడకపోవడంతో పిటిషన్ను తోసిపుచ్చింది.మొత్తం మీద రేవంత్‌కు ఊరట లభించింది.

హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతోనే సీఎం కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని వ్యాఖ్యానించిన రేవంత్‌ ఇప్పుడు మరింత రెచ్చిపోతారేమో.కేసీఆర్‌కు కొత్త జ్వరమైనా రావాలి లేదా వచ్చిన జ్వరం కంటిన్యూ అవ్వాలి.

Advertisement

వాస్తవానికి బెయిల్‌ అనేది కేవలం ఊరట మాత్రమే.అది తీర్పు కాదు.

తుది విజయం కాదు.అయినప్పటికీ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ ఏసీబీకి చుక్కెదురు కావడంతో పట్టలేని ఆనందంతో ఉంటాయనడం వాస్తవం.కాకపోతే రేవంత్‌కు ఇబ్బందికరమైన విషయమేమిటంటే కొడంగల్‌ దాటి రాకూడదనే నిబంధన.

ఆయన హైదరాబాదులోనే ఉన్నట్లయితే రోజూ పండుగ వాతావరణమే ఉండేది.

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు
Advertisement

తాజా వార్తలు