తెలంగాణలో రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి.రైతులకు ఆర్థికంగా చేయూత ఇవ్వడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి రోజు 22.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేస్తుంది.ఇప్పటికే పది విడతల్లో రైతుల ఖాతాల్లో సర్కార్ నిధులు జమ చేసింది.కాగా వానాకాలం పంటకు సంబంధించి సుమారు 70 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు సాయం అందించనున్నారు.అదేవిధంగా ఈ సారి 1.5 లక్షల మంది పోడు రైతులకు సైతం రైతుబంధు అమలు చేయనుంది.ఈ సీజన్ లో కొత్తగా ఐదు లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింప జేసింది.తాజాగా విడుదల చేస్తున్న నిధులతో కలిపి ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం.







