శంకర్ - చరణ్ 'RC15' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ బజ్ నిజమేనా?

మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్. అయితే ఈయన అంతా ఈజీగా ఏమీ స్టార్ హీరోగా ఎదగలేదు.

 Release Date Fixed For Ram Charan Shankar Rc15 Project-TeluguStop.com

మొదట్లో చాలానే విమర్శలు ఎదుర్కొన్నాడు.అయితే ఈయన డెడికేషన్ తో వాటిని కూడా చెరిపేసి స్టార్ హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందు నిలబడ్డాడు.

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించు కున్నాడు.ఇక ఇప్పుడు రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇప్పటుకే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఆసక్తికర బజ్ వినిపిస్తుంది.

శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా వైడ్ భారీ అంచనాలు ఉన్నాయి.ఈ అంచనాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నారని టాక్ బయటకు వచ్చింది.

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Telugu Anjali, Shankar, Kiara Advani, Ram Charan, Rc, Suneel-Movie

ఈ సినిమాను మేకర్స్ మార్చి 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.ఎందుకంటే అప్పుడు పండుగ సీజన్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ హాలిడేస్ కూడా కలిసి వస్తాయి అనే ఉద్దేశంతో ఆ డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube