కరోనా పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా వింజృంభణ కొనసాగుతుంది.పలు ఆంక్షలు కారణంగా ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
కరోనా విలయతాండవంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు.షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది.
దీంతో ప్రజలంతా ఒకింత ఆశ్చర్యానికి.ఒకింత ఆందోళనకు గురయ్యారు.
ఇలా ఆకాశం రంగు మారంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే భయాందోళనకు సైతం గురయ్యారు.ఈ వీడియోపై కొందరు చైనీయులు స్పందిస్తూ.ఇలా ఆకాశం ఎరుపు రంగులోకి మారడం అపశకుమని కామెంట్ చేశారు.ఇప్పటికే కరోనా కారణంగా దేశం మొత్తం అల్లకల్లోలం అయిందని.ఇప్పుడు ఇది ఇంకా దేనికి కారణం అవుతుందో అంటూ తెగ హైరానా పడిపోయారు.నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు.ఆకాశం కూడా ఎర్రగా మారడం నన్ను ఆశ్చర్యపరుస్తుందని మరో నెటిజన్ తెలిపాడు.
ఇదిలా ఉండగా.ఈ విచిత్ర ఘటనపై చైనాలోని టెలివిజన్, డిజిటల్ మీడియా మాత్రం ఈ వింత రంగు మానవ నిర్మితం కాదని, సహజ కాంతి వక్రీభవన ఫలితమని వివరించాయి.మరోవైపు వుహాన్‌లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన ఓ నిపుణుడు స్పందిస్తూ.భూ అయస్కాంత కార్యకలాపాల ఫలితంగా ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు.ఇది ప్రకృతిలో ఓ భాగమని.కొన్ని మార్పులు సంభవించినప్పుడు ఇలా జరగడం మామూలేనని కొందరి వాదం.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిపై నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.