ఈ సారి మీరు తాగిన లెక్కెంతో తెలుసా?

మందు బాబులం మేము మందుబాబులం మందు తాగితే మాకు మేమే మహారాజులం.అరె పైసలు పెట్టి నింపుతాం.

 Record Breaking Liquor Sale On December 31st In India,liquor Sale,new Year Eve,-TeluguStop.com

చిల్లర పెట్టి నింపుతాం.ఖజానా నిండే దాక మందంతా తాగేస్తాం.

ఏమైంది సింగింగ్ సాంగ్ అనుకుంటున్నారా? మరి ఒక లెక్క చూస్తే ఇదే సాంగ్ గుర్తుకు వస్తుంది.అలా ఉంటది మన పంచాయితీ మరీ.ఎంత తాగారో తెలుసా ఈసారి.అబ్బబ్బ అబ్బబ్బ లెక్క చూస్తే సర్కారు వాళ్ళు ఎంత సంతోషపడతారో .మీరు కదా మాకు కావాల్సింది అని నెత్తిన పెట్టుకుంటారు.తాగి ప్రాణాలు పాడు చేసుకుంటారు అని దిగులు ఉంటదో ఉండదో అది వాళ్లకే తెలియాలి కానీ.

మీరు తెచ్చిన పైకం చూస్తే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు చాలు కొత్త సంవత్సరమా మజాకా.ఇది కదా మాకు కావాల్సింది అని అనుకోరు గల్ల పెట్టె నిండినొల్లు…

తాగి ఒక సైడ్ నింపితే.

పోలీసులకు దొరికి ఫైన్ లతోటి మరింత ఖజానా నింపారు.ప్రతి సంవత్సరం 31 ఫస్ట్ దావత్ అంటే ఉదయం మందు లెక్కలు తెలిస్తే బిత్తరపోవాల్సి వచ్చేది.

పోయిన సారి మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపితే.ఆ లెక్క ఈ సారి మరింత పెరిగింది అని తెలిపింది.

అవునా మేం తాగింది ఎంత మా జేబుల్లో ఎంత ఖాలీ అయింది మా తాగుబోతుల సంఘాలు లిమిట్ గా తాగేటొల్లు అందులోనే జలకములాడేటొల్లు ఇలా మొత్తం మీద ఎంత పైసలు తగలబెట్టారు మందుకు.అని ఎదురు చూస్తున్నారా లెక్క కోసం.డిసెంబర్ 31 ఫస్ట్ రోజు ఒక్క రోజే 215.74 కోట్ల మందు డిపోల నుంచి సరఫరా అయిందట.2లక్షల17వేల 399 కేస్ ల లిక్కర్, 1లక్ష 28వేల 446 కేస్ ల బీర్లు.మీ పుణ్యమా అని ఎంత మందు సరఫరా అయిందో విన్నారా? కరోనా లేదు ఆంక్షలు అసలే లేవు.సో ఈ సారి ఈ విధంగా వచ్చింది మందు లెక్కలు.మరి దీనితో వచ్చిన లాభం చెప్తే మరోలా అనిపిస్తుంది.సంవత్సరం అయిపోవస్తుంది అని బాధ తో కావచ్చు.వారం రోజుల నుంచే ఒక లక్ష 111.29 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి మందు అమ్మడం వల్ల.

Telugu Drunk Drive, Liquor Sale, Liquor, Eve-Press Releases

పోయిన సంవత్సరం 925.92 కోట్లు వచ్చాయి.అంటే చివరి సంవత్సరంతో పోలీస్తే ఈ సంవత్సరం 185 కోట్ల మందు ఎక్కువగా అమ్ముడు పోయింది అన్నమాట.

పోయినసారి లాగానే ఈ సారి కూడా రెండు గంటలు ఎక్కువ సమయం ఇచ్చారు మందు అమ్మడానికి.రండి తాగండి మీ డబ్బులను మా డబ్బులుగా మార్చిపొండి అని షాపులు ఓపెన్ చేసి పెట్టారు.

వీల్లు దొరికిందే సందు ఇగ రాదు మందు అనుకున్నారో ఏంటో కానీ ఫుల్ గా తాగారు అని అయితే తెలుస్తోంది.అయ్యో ఇంతేనా ఇంక తాగడంతోనే కాదు అటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికి మన ప్రభుత్వానికి ఎంతో సాయం చేశారు.

అయినా మనొల్లు తాగకపోతే షాపులో అమ్ముతారా? వాళ్లు అమ్మకపోతే మనొల్లు కొంటారా? అవినాభావ సంబంధం అలా ఉంది మరీ ఏం చేస్తాం.

Telugu Drunk Drive, Liquor Sale, Liquor, Eve-Press Releases

కానీ మొత్తానికి అయితే 2021 సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అయితే ఫుల్ గా మందు అమ్ముడు పోయింది.పోయిన సంవత్సరం 30వేల 222.27 కోట్ల రూపాయలు వచ్చి పడితే.ఈ సారి 34వేల 352.75 కోట్ల మద్యం అమ్ముడుపోయిందట.ఈ లెక్కలు స్వయానా ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చినవే.ఇదండి మీరు ఈ సారి తాగిన లెక్కలు.ప్రతి ఒక్కరు ఒక్క గ్లాస్ తాగి అయినా కానీ ఇంత లాభం తెచ్చిపెట్టారు మన ప్రభుత్వానికి.ఏదో సాధించినట్టు ఫుల్ గా తాగినవాళ్లకి ఓ విన్నపం.

మీ ఆరోగ్యం జాగ్రత్త.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube