హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో పొలిటికల్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య సయోధ్య కుదిరింది.
ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ తను మాట్లాడిన ప్రతి మాట నిజమని చెప్పారు.సమాజంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు.
ఈ విషయం పార్టీలకు చెందినది కాదన్న సర్పంచ్ అన్యాయాలు, అరాచకాలను సహించవద్దని పేర్కొన్నారు.ఎమ్మెల్యే రాజయ్య వలనే గ్రామ సర్పంచ్ అయ్యానని, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
మహిళలకు గౌరవం ఇవ్వకుంటే కిరోసిన్ పోసి తగలపెట్టేందుకు కూడా రెడీ అని వ్యాఖ్యనించారు.
మహిళల ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు.
జానకీపురం గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు.జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు తెలిపారు.







