కోలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రజినీకాంత్(Rajinikanth) తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vice President Venkaiah Naidu)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చలేదంటూ రజనీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా రజనీకాంత్ శనివారం సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజనీకాంత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంతో గొప్ప రాజకీయ నాయకుడైనటువంటి వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి తనని రాజకీయాలకు దూరం చేశారని, ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు.ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నవారికి ఎలాంటి అధికారాలు ఉండవు.అందుకే ఈయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వకుండా మరికొన్ని రోజులపాటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదని రజనీకాంత్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు కూడా రజనీకాంత్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.రజనీకాంత్ ఒక మంచి నటుడు అయితే ఆయనని రాజకీయాలలోకి రావద్దని నేనే చెప్పాను.ప్రజలకు సేవ చేయాలి అంటే కేవలం రాజకీయం ఒకటే కాదని ఇతర మార్గాల ద్వారా కూడా సేవ చేయొచ్చు కానీ రాజకీయాలలోకి వచ్చేవారిని నిరుత్సాహ పరచదల్చుకోలేదంటూ ఈ సందర్భంగా రజినీకాంత్ గురించి వెంకయ్య నాయుడు మాట్లాడారు.
ఇక రాజకీయాలలోకి రావాలంటే ఆరోగ్యంతో పాటు, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం ఉంటేనే రాజకీయాలలోకి రావాలని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.







