ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై( MLC Elections ) ఇప్పుడు ప్రధానంగా టిడిపి, వైసిపిలు దృష్టి సారించాయి.ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు( YCP ) పరాభవం చెందడం, ఊహించని విధంగా టిడిపి అభ్యర్థులు విజయం సాధించడాన్ని ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీ చాలా సీరియస్ గానే తీసుకుంది.
ఇప్పుడు జరగబోతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో వైసిపి ఉంది.ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావ్వాల్సి ఉంది.
వైసిపి కి ఈ ఎన్నికల్లో విజయానికి ఎటువంటి డోఖా లేదు.ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలతో పాటు, టిడిపి ( TDP ) నుంచి వచ్చిన నలుగురు, జనసేన నుంచి వచ్చిన ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఉండడంతో, ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయని ధీమా ఒకవైపు ఉన్నా.
వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రస్తుతం పార్టీకి దూరమయ్యారు.

ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇద్దరు టిడిపికి ఓటు వేసే అవకాశం ఉంది.వీటితో కలుపుకుంటే టీడీపీకి 21 మంది ఎమ్మెల్యే ల బలం ఉంటుంది.ఇంకా ఒక్క ఎమ్మెల్యే అవసరం ఏర్పడింది.
దీంతో వైసీపీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా టిడిపి వైపు వస్తారేమో అన్న అంచనాలో టిడిపి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం టిడిపికి ఇవ్వకూడదని వైసిపి ఉంది.అంతే కాకుండా టిడిపి నుంచి వైసీపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలు ఎవరా అనే విషయం పైన ఇప్పుడు ఆరా తీస్తోంది.
ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

అయితే ఇప్పటికే టిడిపి నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు టిడిపితో టచ్ లో ఉన్నట్లుగా టిడిపి అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అవుతుంది.టిడిపికి అవసరమైన ఒక్క ఓటును చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.
ఆ పార్టీ నుంచి తమ వైపు చూస్తున్న వారికి గాలం వేసే పనిలో పడింది.ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీన ఎమ్మెల్యేలకు విందును వైసీపీ ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం వైసిపి, టిడిపిలు గెలుపు ధీమాలో ఉన్నాయి.తమకు ఏడుకు ఏడు స్థానాలు దక్కుతాయని వైసిపి భావిస్తుండగా, తమకున్న బలం మేరకు ఆ ఒక్క స్థానాన్ని తాము దక్కించుకు తీరుతామని, ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు అనే లెక్కల్లో టీడీపీ ఉంది.
