Pithapuram TDP : పిఠాపురం టీడీపీలో తిరుగుబావుట.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం..!!

ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ -జనసేన – బీజేపీ పొత్తుతో బరిలో దిగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల వ్యవహారంపై మూడు పార్టీలకు చెందిన నేతల్లో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి.

 Rebellion In Pitapuram Tdp Ready For Mass Resignations-TeluguStop.com

తాజాగా టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించడంతో ఈ నిరసనలు మరింతగా పెరిగాయి.ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituenc )లో టీడీపీ తిరుగుబావుటా ఎగురవేసింది.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలను చించేయడంతో పాటు పార్టీ కరపత్రాలను పార్టీ శ్రేణులు తగలబెట్టారు.

ఇన్ని రోజులుగా పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా వర్మకి సీటు వస్తుందని భావిస్తూ వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిఠాపురం నుంచి వర్మకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని టీడీపీ శ్రేణులు తేల్చి చెబుతున్నారు.కాగా టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు ఫ్లెక్సీలను, కరపత్రాలను దగ్దం చేయడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube