ఇలియానాకు అందుకే సినిమాలు ఇవ్వట్లేదట.. అడ్వాన్స్ తీసుకొని అలా చేయడంతో?

ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ఇలియానాకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేవు.

తెలుగులో 2011 వరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుని వరుస ఆఫర్లతో ఇలియానా బిజీగా ఉన్నారు.

అయితే ఈ గోవా బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కు దూరమయ్యారు.ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలో ఇలియానా నటించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన కాట్రగడ్డ ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సుమన్, సీనియర్ నరేష్, అక్కినేని నాగేశ్వరరావులతో కాట్రగడ్డ ప్రసాద్ ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారు.

తనతో చేసిన ఏ హీరోలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదని కాట్రగడ్డ ప్రసాద్ చెప్పుకొచ్చారు.అయితే తాను నిర్మాతలు దెబ్బ తింటే ఆదుకోవాలని హీరోలకు సూచిస్తున్నానని కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు.

Advertisement
Reasons Behind Heroine Ileana Did Not Get Movie Offers, Ileana, Interesting F

నాతో సినిమాలు తీయని హీరోలనే తాను కోరుతున్నానని కాట్రగడ్డ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Reasons Behind Heroine Ileana Did Not Get Movie Offers, Ileana, Interesting F

ఇలియానా ఒక తమిళ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకుందని అయితే ఆ నిర్మాతకు ఇలియానా డేట్లు ఇవ్వలేదని అదే సమయంలో అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదని కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు.ఇప్పటివరకు ఆ కంప్లైంట్ అలానే ఉందని ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ఇలియానాను తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని కాట్రగడ్డ ప్రసాద్ వెల్లడించారు.

Reasons Behind Heroine Ileana Did Not Get Movie Offers, Ileana, Interesting F

ఆ ప్రొడ్యూసర్ కు ఇలియానా ఏదో విధంగా న్యాయం చేయాలని కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు.ఇలాంటి కంప్లైంట్లు చాలా ఉన్నాయని కాట్రగడ్డ ప్రసాద్ వెల్లడించారు.అయితే ఇలా మొదలైన వివాదాలను తర్వాత కాలంలో చాలామంది పరిష్కరించుకున్నారని కాట్రగడ్డ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇలియానాకు ఎక్కువగా సౌత్ ఇండియాలో ఆఫర్లు రాకపోవడానికి అసలు కారణం తెలిసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.

మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
Advertisement

తాజా వార్తలు