కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ తరువాత కాలంలో నటుడిగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు విజయాలను అందుకుని మిడిల్ రేంజ్ హీరో స్థాయికి ఎదిగారు.అయితే ఈ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపులుగా మిగులుతున్నాయి.
కథల ఎంపిక పరంగా శర్వానంద్ తప్పేం లేకపోయినా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు.
శర్వానంద్ గత నాలుగు సినిమాలు పడిపడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్లు అయ్యాయి.
వరుస ఫ్లాపులు శర్వానంద్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.నవ్యత ఉన్న కథలను ఎంచుకోకపోవడం వల్లే శర్వానంద్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
వరుస ఫ్లాపుల నేపథ్యంలో శర్వానంద్ భవిష్యత్ ప్రాజెక్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ నటించిన సినిమాలేవీ ఆ సినిమా స్థాయిలో సక్సెస్ కాలేదు.శర్వానంద్ ఫ్లాపులకు శ్రీకారం సినిమా బ్రేక్ వేస్తుందని భావిస్తే ఆ సినిమా అంచనాలను భిన్నంగా డిజాస్టర్ కావడం గమనార్హం.శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జాతిరత్నాలు సినిమా శ్రీకారం సినిమాపై ప్రభావం చూపుతోందని చెప్పాలి.
జాతిరత్నాలు సినిమా రికార్డుస్థాయిలో కలెక్షన్లను రాబడితే శ్రీకారం సినిమా మాత్రం 60 శాతం కలెక్షను కూడా రాకపోవడం గమనార్హం.శర్వానంద్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త వహించకపోతే మాత్రం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఉండగా ఈ సినిమాలపైనే శర్వానంద్ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.ఈ సినిమాలు హిట్ అయ్యేలా శర్వానంద్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.