స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి( Saipallavi ) ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సాయిపల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాలో( Thandel ) నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా చందూ మొండేటి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.అయితే సాయిపల్లవి చెల్లి పూజాకన్నన్ తాజాగా పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అయితే సాయిపల్లవి పెళ్లి చేసుకోకుండా పూజా కన్నన్ పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సాయిపల్లవికి పెళ్లి ఇష్టం లేదని అందుకే పూజాకన్నన్ పెళ్లికి సంబంధించి ప్రకటన వచ్చిందని సమాచారం అందుతోంది.
సాయిపల్లవి పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

తండేల్ సినిమాలో సాయిపల్లవి రోల్ కీలకమని సాయిపల్లవి ఈ సినిమాతో మరోసారి క్రేజ్ ను పెంచుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.తండేల్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

తండేల్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.నాగచైతన్య( Naga Chaitanya ) గత కొన్నేళ్లుగా నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.నాగచైతన్య పారితోషికం ప్రస్తుతం 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చైతన్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.సాయిపల్లవి ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టడం వల్లే కొత్త సినిమా ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సాయిపల్లవి భవిష్యత్తులో వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.