మాజీ భార్య కామెంట్ల విషయంలో పవన్ సైలెంట్ గా ఉండటానికి రీజన్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకవైపు పొలిటికల్ కార్యక్రమాలతో, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో రేణుదేశాయ్ ( Renu Desai ) నుంచి పవన్ కళ్యాణ్ కు ఘాటైన కౌంటర్లు వస్తున్నాయి.

 Reasons Behind Pawan Silence About Renu Desai Comments Details, Pawan Kalyan, Pa-TeluguStop.com

రేణు దేశాయ్ కామెంట్ల విషయంలో కొంతమంది ఆమెను సమర్ధిస్తుంటే మరి కొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.నెటిజన్ల కౌంటర్లకు సైతం ఆమె తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య కామెంట్ల గురించి స్పందించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు.పవన్ సినీ యాక్టర్ మాత్రమే అయ్యి ఉంటే విమర్శల గురించి స్పందించకపోయినా నష్టం ఉండేది కాదు.

కానీ పవన్ ఇప్పుడు జనసేన అధినేత( Janasena ) కావడంతో విమర్శలు గురించి ధీటుగా స్పందించి జవాబిస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.పవన్ సైలెన్స్ వల్ల ఆరోపణలు నిజమేనని నమ్మాల్సి వస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే స్పందించడం వల్ల మరిన్ని విమర్శలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని పవన్ సైలెంట్ గా ఉన్నారని బోగట్టా.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుండగా పవన్ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తుండటం గమనార్హం.పవన్ కు జోడీగా ఒక సినిమాలో శ్రీలీల నటిస్తుండగా మరో సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు.పవన్ సినిమాలలో వినోదాయ సిత్తం రీమేక్ మాత్రమే ఈ ఏడాది రిలీజ్ కానుంది.

పవన్ మిగతా సినిమాలన్నీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.

పవన్ కళ్యాణ్ 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రోజుకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని పవన్ బహిరంగంగా వెల్లడించారు.2024 ఎన్నికల నాటికి ప్రకటించిన సినిమాలు పూర్తయ్యే విధంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube