Etela Rajagopal Reddy Delhi Tour: పదవుల పిలుపు : రాజగోపాల్ రాజేందర్ ఢిల్లీ టూర్ వెనుక ..?

అకస్మాత్తుగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మునుగోడు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సీనియర్ పొలిటిషన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.హై కమాండ్ పెద్దలను కలుసుకునేందుకు అక్కడే మకాం వేశారు.

 Reasons Behind Bjp Leaders Etela Rajender Komati Reddy Rajagopal Reddy Delhi Tou-TeluguStop.com

అయితే ఉన్నట్టుండి ఈ ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ టూర్ వెళ్లడం వెనక కారణాలు ఏమిటి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.అయితే వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడానికి హై కమాండ్ పిలిపే కారణం గా తెలుస్తోంది.

తెలంగాణ బిజెపిలో చాలామంది కీలక నాయకులే ఉన్నా,  రాజేందర్, రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ఢిల్లీ పెద్దలు ఆహ్వానించారు.వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక అంశాల గురించి చర్చించబోతున్నట్లు సమాచారం.
  అయితే వీరిద్దరికీ కీలక పదవులను అప్పగించేందుకే బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచినట్టు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి చాలామంది కీలక నాయకులు బిజెపిలో చేరారు.

అయితే వారి ప్రాబల్యం పెరగకుండా ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తున్నారని, కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే తమ ప్రాధాన్యం తగ్గుతుందనే ఆలోచనతో వారి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని హై కమాండ్ దృష్టికి వెళ్లడంతో,  బిజెపిలో కొత్తగా చేరాలనుకున్న నాయకులు వెనకడుగు వేస్తూ ఉండడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న బిజెపి అగ్ర నేతలు రాజేందర్,  రాజగోపాల్ రెడ్డికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా తమ పార్టీలో చేరాలనుకున్న వారికి భరోసా ఇచ్చే సంకేతాలను పంపించినట్లు అవుతుందని భావిస్తున్నారట.
 

Telugu Amith Sha, Etelarajender, Hujurabad, Komatirajagopal, Munugodu, Rajagopal

బిజెపిలో చేరితే ఏదో ఒక పదవి వస్తుందనే అభిప్రాయం వారిలో కలిగితే ముందు ముందు మరిన్ని చేరికలు ఉంటాయనే ఆలోచనతో రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ని ఢిల్లీకి పిలిపించి కీలక పదవులు హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.అలాగే ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్య నేతలు ద్వారా పెద్ద ఎత్తున బిజెపిలోకి చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేయాలని, ఎంత ఎక్కువ మంది నేతలు చేరితే అంతగా ప్రాధాన్యం ఇస్తామని దిశా నిర్దేశం చేయబోతున్నారట.అలాగే రాజేందర్, రాజగోపాల్ రెడ్డికి దక్కబోయే పదవులు ఏమిటి అనే దానిపైనా తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube