దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు అసలు కారణం ఇదే..?

మూడు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో గత సీజన్లలాగే వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.

మొదట్లో ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లు అనే కామెంట్లు వినిపించినా వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన అవినాష్, స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ కు రావడం షోకు ప్లస్ అయ్యాయి.

అయితే నిన్న రాత్రి బిగ్ బాస్ ప్రేమికుల అంచనాలకు భిన్నంగా దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేయడంతో బిగ్ బాస్ షోను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.మూడో వారం నామినేషన్ మొదలైన రోజు నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపించాయి.

అయితే ఊహించని విధంగా చివరి నిమిషంలో దేవి ఎలిమినేట్ అయింది.దీంతో బిగ్ బాస్ ఓటింగ్ సరళిపై విమర్శలు వ్యక్తం కావడంతో పాటు బిగ్ బాస్ కు గత వారం అందరూ సారీ చెప్పినా దేవి సారీ చెప్పకపోవడంతో ఎలిమినేట్ చేశారని.

బిగ్ బాస్ నిర్వాహకులు కావాలనే దేవిని షో నుంచి తప్పించారని కామెంట్లు వినిపించాయి.అయితే చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలే దేవి ఎలిమినేట్ కావడానికి కారణమని తాజాగా సమాచారం అందుతోంది.

Advertisement

ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవి ఎలిమినేట్ కావడానికి సోషల్ మీడియా కారణమైంది.మెహబూబ్ బిగ్ బాస్ షోలో పెద్దగా టాలెంట్ చూపించలేకపోయినా అతనికి యూట్యూబ్ లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కుమార్ సాయికి మంచి గుర్తింపే ఉంది.దేవి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరో కుటుంబానికి ఆగ్రహం తెప్పించిందని.

దీంతో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా డేంజర్ జోన్ లో ఉన్న కుమార్ సాయి, మెహబూబ్ లకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ గా ఉండటం వల్ల ఆమెకు బయట పెద్దగా అభిమానులు కూడా లేరు.

దీంతో ఓటింగ్ సరళి ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి దేవి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని సమాచారం.

స్టార్ హీరో బాలయ్యకు ఆ మంత్రి పదవి.. టాలీవుడ్ రాతను బాలయ్య మార్చేస్తారా?
Advertisement

తాజా వార్తలు