ప్రియాంక చోప్రా మేనేజర్ కి తెలుగు హీరోయిన్ తో ఏం పని?

ప్రకాష్ జాజు .బాలివుడ్ ని విపరీతంగా ఫాలో అయితే తప్ప ఈయన గారు ఎవరో తెలిసి ఉండటం కష్టం.

తెలిస్తే ఒకే కాని, తెలియనివారికి చెప్పేదేంటంటే, బాలివుడ్ సినిమాలకి ఫైనాన్స్ అందిస్తుంటారు ఈయన.ఒక్కప్పుడు ప్రియాంక చోప్రా మేనేజర్ గా పనిచేసాడు.ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించి ఉద్యోగం పోగొట్టుకున్నాడని బాలివుడ్ జనాలు ఇప్పటికి చెప్పుకుంటారు.

సరే అదంతా మనకెందుకు కాని, ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ ని తెగ ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు ప్రకాష్ జాజు.మంచు మనోజ్ తో పోటుగాడు చిత్రంలో నటించిన సాక్షి చౌదరి గుర్తుందా? అదే ఆ మధ్య అల్లరి నరేష్ "జేమ్స్‌బాండ్" చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి.కొత్తగా అల్లరి నరేష్ సెల్ఫీ రాజాలో కూడా కనబడబోతోంది.

ఈ అమ్మడుని ప్రకాష్ జాజు తెగ ప్రమోట్ చేస్తున్నాడు.బాలివుడ్ లో ఒక ఆఫర్ కూడా ఇప్పించాడు.

Advertisement

అసలు ఈ ప్రకాష్ జాజుకి, సాక్షి చౌదరికి ఏంటి సంబంధం, ఇటు తెలుగులో, అటు హిందీలో ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అని ఆరాతీస్తే తెలిసింది, ప్రకాష్ జాజు స్నేహితుడి కూతురు అంట సాక్షి.అందుకే అవకాశాలు ఇప్పిస్తున్నాడు.

మరి ఇప్పటివరకు రాని సక్సెస్, పేరు ఇప్పటినుంచైనా దొరుకుతాయో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు