వైసీపీలో ఆ పార్టీ నేతలకు నో ఎంట్రీ ! రీజన్ ఏంటి ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతున్నారు.

ఆ పార్టీకి కొద్దికాలంగా జనాల్లో ఆదరణ పెరిగినట్టుగా అనేక సర్వేలు కూడా బయటకి వచ్చాయి.

ఈ స్పీడ్ మరింత పెంచేలా జగన్ కూడా ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎన్నికల సమయంలో పార్టీలో కొత్త ఉత్సాహం పెరిగేలా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో అన్ని పార్టీల కీలక నాయకులకు వల వేస్తున్న వైసీపీ ఒక్క పార్టీ విషయంలో మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేస్తున్నాడు.

తాము మీ పార్టీలో చేరాలనుకుంటున్నామని రాయభారం పంపినా జగన్ మాత్రం స్పందించడం లేదు.ఇంతకీ ఆ పార్టీ మరేదో కాదు బీజేపీ.

Reason Why Kanna And Kavuri Are Not Possible To Join In Ycp

వైసీపీ లోకి వచ్చి చేరుతున్నవారిలో ఎక్కువ మంది టీడీపీ నాయకులే కనిపిస్తున్నారు.ఆ పార్టీలో తమకు టికెట్ దక్కలేదనే లేక ప్రాధాన్యం కరువయ్యిందనే ఏమో కానీ వరుస వరుసగా పార్టీలోకి వచ్చి చేరుతున్నారు.ఈ చేరికల కోసం జగన్ ఓ రోజు ప్రచారాన్ని నిలిపి వేసి మరీ లోటస్‌పాండ్‌లో ఉండిపోయారు.

Advertisement
Reason Why Kanna And Kavuri Are Not Possible To Join In Ycp-వైసీపీ�

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ? అన్ని పార్టీల నాయకులు జగన్ తో కండువాలు వేయించుకుంటుంటే అందులో బీజేపీ నాయకులు కనిపించకపోవడం ఇప్పుడు చర్చగా మారింది.ప్రస్తుతం ఏపీలో బీజేపీ గడ్డుపరిస్థితి ఎదుర్కుంటోంది.

ఆ పార్టీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.

Reason Why Kanna And Kavuri Are Not Possible To Join In Ycp

గత ఎన్నికల ముందు రాజకీయ ఉనికి కోసం ఇతర పార్టీల నుచి బీజేపీలో చేరిన నాయకులు ఇప్పుడు ప్రత్యామ్న్యాయం కోసం వైసీపీ వైపు చూస్తున్నారు.ఇప్పటికే వైసీపీలో టికెట్ల పంపిణీ పూర్తయినా ఆ పార్టీలో ఏదో ఒక ప్రాధాన్యం దక్కుతుంది అనే ఆశతో వైసీపీలోకి రావాలని చూస్తున్నారు.కానీ ఇక్కడ వైసీపీ నుంచి రెస్పాన్స్ కనిపించడంలేదు.

వాస్తవానికి ఏలూరు పార్లమెంట్ బరిలో బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు వైసీపీ తరపున రంగంలోకి దిగాలని చూసారు కానీ వర్కవుట్ అవ్వలేదు.అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా వైసీపీ లో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ అదే జరగలేదు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..

ఇంకా అనేకమంది బడా నాయకులు చేరదామని చూస్తున్నా వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రావడంలేదని తెలుస్తోంది.బీజేపీ నాయకులు వైసీపీలో చేరితే కుమ్మక్కు రాజకీయం అనే అపవాదుని నెత్తిన వేసుకోవాల్సి వస్తుందేమో అన్న సందేహంలో జగన్ ఉన్నట్టు అర్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు