ఆర్ఆర్ఆర్‌లో తారక్ ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఉన్నారు.

 Reason For Ntr Wearing Skull Cap In Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని సినీ విశ్లేషకులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.అటు ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్లకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలోని తారక్ పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో ఒక సీన్‌లో తారక్ ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని కనిపించాడు.

 Reason For Ntr Wearing Skull Cap In Rrr-ఆర్ఆర్ఆర్‌లో తారక్ ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొంతమేర వివాదం కూడా రేగింది.హిందువు అయిన కొమురం భీం ఇలా ముస్లిం టోపీతో కనిపించడం ఏమిటని పలువురు వాదించారు.

అయితే ఈ సినిమాలో తారక్ అలా ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకున్నాడనే విషయంపై ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో నిజాం పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో తారక్ అలా ఆ టోపీ పెట్టుకుంటాడని ఆయన తెలిపారు.

కొమురం భీం పాత్రలో తారక్ విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌ను రెడీ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా అదరగొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మొత్తానికి ఇద్దరు స్వాతంత్ర్య పోరాట యోధులు ఒకవేళ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

#Ram Charan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు