ఆంధ్రావాలా సినిమాలో ఆ ఒక్కటి జరిగితే పక్కా హిట్ అయ్యేది !

రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమాలో నటించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి తిరుగు లేని ఘనవిజయం దక్కింది.ఈ చిత్రం తర్వాత వచ్చే సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి.

 Reason Behind Ntr Andhrawala Flop,andhrawala,,ntr,harikrishna,puri Jagannadh,cha-TeluguStop.com

అప్పుడే పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఆంధ్రా వాలా సినిమాకు కమిట్ అయ్యాడు తారక్.ఈ చిత్రంలో అతడు ద్విపాత్రాభినయం చేశాడు.

రక్షిత హీరోయిన్ గా తారక్ సరసన నటించిన ఆంధ్రావాలా సినిమా 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ భారీ అంచనాల తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బొక్క బోర్లా పడింది.

సింహాద్రి సినిమా రేంజ్ లో ఉంటుందని థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడికి నిరాశ తప్పలేదు.ఇక ఈ చిత్రంలో మొదటి సారి తారక్ ద్విపాత్రభినయం చేసిన వర్క్ ఔట్ అవ్వలేదు.

కానీ అప్పట్లో హరికృష్ణ కొడుకు గా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉంది.హరి కృష్ణ సైతం హీరో గా సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తారక్ నటించడం కన్నా హరి కృష్ణ కనుక నటించి ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది అని ట్రేడ్ వర్గాలు భావించాయి.అలాగే ఇద్దరినీ ఒకేసారి తెరపై చూసుకునే అవకాశం నందమూరి అభిమానులకు దక్కేది.కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా తారక్ కెరీర్ లో డిజాస్టర్ లాస్ట్ లో పడింది.వాస్తవానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి.

చక్రి అందించన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.కానీ మితిమీరిన హైప్ క్రియేట్ అవ్వడం తో ఆ అంచనాలు అందుకోవడం లో విఫలం అయింది ఆంధ్ర వాలా చిత్రం.
పూరి జగన్నాథ్ సైతం అప్పటికే హ్యాట్రిక్ విజయాలను దక్కించుకోవడం తో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్రదర్శించాడు.2004 లో 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సంగం వసూళ్లు కూడా సాధించలేకపోయింది.ఇక ఈ సినిమా కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా విడుదల అయ్యి అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube