క్రికెట్ ఫాన్స్ కు యాంకర్ మాయంతి లాంగర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మరి అలాంటి మాయంతి ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యారు.
ఈ విషయాన్ని స్వయంగా మాయాంతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.మరి దానికి గల కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
యాంకర్ మాయంతి లాంగర్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీను 2012లో వివాహం చేసుకున్నారు.అయితే ఆరు వారాల క్రితం మాయంతి లాంగర్ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఇక ఆ కారణంగానే ఈసారి మాయంతి ఐపీఎల్ లో భాగం కాలేదని విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.ఇక గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్ తన కుటుంబంలో నన్ను భాగం చేసింది.
వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో నేను యాంకర్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను.ఇక కరోనా లేకపోయుంటే ఐదు నెలల ప్రెగ్నెన్సీతో ఈసారి ఐపీఎల్ కు యాంకర్ గా వ్యవహరించేదాన్ని.
ప్రస్తుతం నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఈ విషయంలో స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం అండగా నిలిచింది.అందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని మాయంతి ట్వీట్ చేసింది.