ఆ ఎమ్మెల్యే అధికారం ఉంటే త‌ప్పా మాట్లాడ‌రా..? ఎందుకీ మౌనం..!

ఎమ్మెల్యే అన్నాక నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ గా ఉండాలి.అవ‌స‌ర‌మైన‌ప్పుడు పార్టీ కోసం వాయిస్ వినిపించాలి.

 Reason Behind Kurasala Kannababu Silence, Kurasala Kannababu, Kakinada Rural Con-TeluguStop.com

అయితే ప్ర‌త్యేక ప‌ద‌వి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే త‌ప్పా కొంద‌రు నోరుమెద‌ప‌రు.బాధ్య‌త‌లేదో నోరుమెద‌ప‌రు.

లేదా సొంత ఇలాకాలో మ‌రో వ‌ర్గం స‌యాక్టివ్ అయితే.దానికి అధిష్టానం స‌పోర్ట్ ఇచ్చినా ఇక సైలెంట్ అయిపోయి ప‌క్క చూపులు చూస్తారు.

ఇప్పుడు అలాగే ఉంది ఏపీలోని మాజీ మంత్రి.ప్ర‌స్తుత ఎమ్మెల్యే.

ఇంత‌కీ ఎవ‌రు అనుకుంటున్నారా.? ఆయ‌నే కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే.కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకు డు.వైసీపీలో చేరిన ఆయన .గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు.జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా కూడా పగ్గాలు చేపట్టారు.సర్కారు తరఫున బలమైన వాయిస్ కూడా వినిపించారు.సర్కారుపై ఎవరు ఏదైనా విమర్శ చేసినా.వెంటనే ఖండించేవారు.

ముఖ్యంగా జనసేన నుంచి వచ్చే విమర్శలకు సూటిగా.సుత్తిలేకుండా అన్నట్టుగా కౌంటర్లు విసిరేవారు.

పార్టీ మార‌తారా?

Telugu Janasena, Kakinadamla, Kakinadarural-Political

అయితే.రెండో దఫా జగన్ కేబినెట్ విస్తరణలో కురసాలకు ద‌క్క‌లేదు.అంతే.ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు.కనీసం మొక్కుబడిగా కూడా ఎక్కడా పెదవి విప్పడం లేద‌ని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే.

పదవి ఉంటే తప్ప.ఆయన నోరు విప్పరా.? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.మరోవైపు.

ఆయన చూపు వేరేలా ఉందని.వచ్చే ఎన్నికల నాటికి .ఆయన అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.వాస్తవానికి కురసాలను ఓడించి తీరాలనేది.

స్థానికంగా ఉన్నరెడ్డి సామాజిక వర్గం బలంగా ప్రయత్నాలు చేస్తోంది.ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కన్నబాబుకు ఎక్కడా పొంత నలేకుండా పోయింది.

ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా వివాదాలు సాగాయి.ఇప్పుడు కూడా పైకి ఎలా ఉన్నా పరిస్థితి మాత్రం అదే.దీంతో వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున పోటీ చేసినా రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అదేసమయంలో కాపు వర్గం.

మొత్తంగా జనసేనవైపు తిరిగితే తనకు డిపాజిట్లు దక్కడం కూడా కష్టమనే భావనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.ఈ ప‌రిస్థిలోనే కురసాల పార్టీ మార్పువైపు దృష్టి పెట్టారని అంటున్నారు.

కుదిరితే దాదాపు జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని.అది కూడా అప్పటి రాజకీయ పరిణామాలను నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్తున్నారు.

మ‌రి రాబోయే రోజుల్లో కుర‌సాల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube