ఈ ఏడాది మే నెలలో ₹2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)( RBI ) కీలక ప్రకటన చేయడం తెలిసిందే.దేశవ్యాప్తంగా ₹2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది.
అదే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు సెప్టెంబర్ 30 వరకు సాధారణ నోట్లు వలె చెలామణి అవుతాయని సెప్టెంబర్ 30కి నోట్లు ఉన్నవారు మార్చుకోవటం లేదా డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.ఈ మేరకు వినియోగదారులకు ₹2000 రూపాయల నోటు ఇవ్వవద్దని బ్యాంకులకు( Banks ) ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.₹2000 నోట్లు కలిగిన వారు తమ ఖాతాలో డిపాజిట్( Deposits ) చేసుకోవడంతో పాటు ఇతర చెల్లుబాటు అయ్యే నోట్లకు మార్చుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులకు సూచించింది.
సెప్టెంబర్ 30 వరకు ఎక్స్చేంజ్ డిపాజిట్లకి అవకాశం ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఆర్బీఐ ₹2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది.88 శాతం ₹2000 నోట్లు బ్యాంకులకు చేరాయని పేర్కొంది.₹3.14 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే గతంలో 2000 నోట్ల మార్పిడికి సంబంధించి విధించిన గడువు పెంచే అవకాశాలు ఉన్నట్లు పలు మీడియాలలో వార్తలు రాగా ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచే అవకాశం లేదని ఆర్బీఐ తేల్చి చెప్పింది.దీంతో తాజా పరిణామాలు చూస్తే 2000 నోట్లు మార్పిడి వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.