రజాకార్ మూవీ( Razakar )లో నిజాం భార్యగా నటించిన అను శ్రీ గురించి మనందరికీ తెలిసిందే.సినిమా పరంగా ఆమె గురించి తెలిసినప్పటికీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అలాగే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది అనుశ్రీ( Anushree ).ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తేంటే చాలా ఆనందం గా ఉంది.సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు.

ముఖ్యంగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్ళల్లో దేశభక్తి కనపడిందని థియేటర్స్ లో భారత్ మాతాకీ జై, వందేమాతరం( Vandematahram ) అంటూ నినాదాలు చేస్తుండడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో తాను నటించడం ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది అను శ్రీ.ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణకు, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది.ఇకపోతే జీవితంలో తన కాలేజ్ పూర్తయిన తర్వాత తాను సివిల్స్ కు చదవాలని తన నాన్న అనుకున్నట్లుగా తెలిపింది.అయితే తనకి చాలా కాలం నుండి నటిని కావాలనే కోరిక బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది.
నేను బెంగళూరులోని థియేటర్స్ గ్రూప్ లో కూడా సభ్యురాలుగా ఉన్నాను.

కానీ నటన కలను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాను.ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నాను.ఈ సినిమాలో పాత్ర కొరకు మొదటగా దర్శకుడిని కలవగా ఆయన నిజాం భార్యగా( Nizam wife ) పాత్ర కోసం వెతుకుతున్నట్లు తెలిపి, నన్ను ఆ పాత్రకు సెలెక్ట్ చేశారు అని తెలిపింది అనుశ్రీ.
సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.తాను వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే దానినని చెప్పుకొచ్చింది.అయితే ఈ పాత్ర చేయడం తనకి సవాల్ గా మారిందని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ఈ సినిమాలో ఏకైక గ్లామర్ రోల్ తనదే అని తెలిపింది.
తాను ఈ పాత్ర కోసం మూడు నెలల పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు ఆమె తెలిపింది.ఇలాంటి బలమైన పాత్ర తన కెరీర్ గొప్పగా నిలుస్తుందని తెలిపింది.







