చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన నేత.. ఎందుకంటే..?

ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి( TDP ) మరో షాక్ తగిలింది.ఇటీవలే విజయవాడ ఎంపీ కేశినేని పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

 Rayapati Rangarao Threw Chandrababu Naidu Photo On The Ground Details, Tdp Presi-TeluguStop.com

తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయపాటి రంగారావు( Rayapati Rangarao ) టీడీపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకు( Chandrababu Naidu ) పంపిన సంగతి తెలిసిందే.

అంతేకాదు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను రాయపాటి కుటుంబ సభ్యులు నేలకేసి పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Tdp Rayapati, Mangalagiri, Rayapati-App Top Ne

టీడీపీని వీడిన రాయపాటి రంగారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అన్న ఆయన అది అసలు రాజకీయ పార్టీనే కాదని చెప్పారు.టీడీపీ వ్యాపార సంస్థ అని, తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందంటూ ఆరోపణలు చేశారు.గత ఎన్నికల్లో సుమారు రూ.150 కోట్లు తమ నుంచి తీసుకున్నారన్నారని ఆరోపించారు.అంతేకాదు చంద్రబాబుతో( Chandrababu Naidu ) పాటు ఆయన కుమారుడు లోకేశ్ ఎంత తీసుకున్నాడనేదానికి సంబంధించి తమ దగ్గర లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Tdp Rayapati, Mangalagiri, Rayapati-App Top Ne

ఈ నేపథ్యంలోనే లోకేశ్( Nara Lokesh ) మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ ఛాలెంజ్ చేశారని తెలుస్తోంది.సవాల్ చేస్తున్నానన్న రాయపాటి మంగళగిరిలో( Mangalagiri ) లోకేశ్ ను ఓడిస్తానని చెప్పారు.కియా కంపెనీనీ తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని రాయపాటి రంగారావు ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో( SC Constituencies ) ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేశ్ పని చేయనివ్వలేదని మండిపడ్డారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Tdp Rayapati, Mangalagiri, Rayapati-App Top Ne

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారట.దాదాపు నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ కే పట్టం కట్టాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.

ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ నేతల్లో సైతం చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని సమాచారం.ఈ నేపథ్యంలోనే రాయపాటి చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube