చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన నేత.. ఎందుకంటే..?
TeluguStop.com
ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి( TDP ) మరో షాక్ తగిలింది.
ఇటీవలే విజయవాడ ఎంపీ కేశినేని పార్టీని వీడిన సంగతి తెలిసిందే.తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయపాటి రంగారావు( Rayapati Rangarao ) టీడీపీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకు( Chandrababu Naidu ) పంపిన సంగతి తెలిసిందే.
అంతేకాదు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను రాయపాటి కుటుంబ సభ్యులు నేలకేసి పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
"""/" /
టీడీపీని వీడిన రాయపాటి రంగారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అన్న ఆయన అది అసలు రాజకీయ పార్టీనే కాదని చెప్పారు.
టీడీపీ వ్యాపార సంస్థ అని, తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందంటూ ఆరోపణలు చేశారు.
గత ఎన్నికల్లో సుమారు రూ.150 కోట్లు తమ నుంచి తీసుకున్నారన్నారని ఆరోపించారు.
అంతేకాదు చంద్రబాబుతో( Chandrababu Naidu ) పాటు ఆయన కుమారుడు లోకేశ్ ఎంత తీసుకున్నాడనేదానికి సంబంధించి తమ దగ్గర లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు.
"""/" /
ఈ నేపథ్యంలోనే లోకేశ్( Nara Lokesh ) మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ ఛాలెంజ్ చేశారని తెలుస్తోంది.
సవాల్ చేస్తున్నానన్న రాయపాటి మంగళగిరిలో( Mangalagiri ) లోకేశ్ ను ఓడిస్తానని చెప్పారు.
కియా కంపెనీనీ తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని రాయపాటి రంగారావు ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో( SC Constituencies ) ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేశ్ పని చేయనివ్వలేదని మండిపడ్డారు.
"""/" /
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారట.
దాదాపు నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ కే పట్టం కట్టాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.
ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ నేతల్లో సైతం చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే రాయపాటి చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..