దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా విక్రమార్కుడు.ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిందనే చెప్పాలి.
రవితేజ కెరీర్ లో కూడా ఈ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ జీవించాడనే చెప్పాలి.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రవితేజకు ఈ పాత్ర మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దుమ్ము దులిపింది.ఈ సినిమాకు అందించిన సంగీతం మరొక ప్లస్ అనే చెప్పాలి.
ఇప్పటికి విక్రమార్కుడు సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ‘జింతాతా చితా చితా జింతతత’.ఇక ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ అవ్వడమే కాకుండా అన్ని చోట్ల విజయ ఢంకా మోగించింది.

మరి ఇంత గొప్ప సినిమా రాజమౌళి తెరకెక్కించడానికి ముఖ్య కారణం విజయేంద్ర ప్రసాద్.ఆయన అందించిన కథ వల్ల ఇంత పెద్ద హిట్ లభించడమే కాకుండా రాజమౌళి కెరీర్ లో కూడా ఈ సినిమా ఒక మైలు రాయిలాగా నిలిచి పోయింది.అయితే తాజాగా ఈ సినిమా గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ రాయబోతున్నాడని సమాచారం.

ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ కూడా రెడీ చేసాడట.ఈ కథ కూడా అంతకుమించి ఉంటుందని అంటున్నారు.విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడు కథ రాసిన దర్శకుడు రాజమౌళినే సినిమా తెరకెక్కిస్తారు.అయితే ఈసారి రాజమౌళి బిజీగా ఉండడం వల్ల ఈ కథను వేరే దర్శకుడికి అప్పజెప్పాలని విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ కథను బడా నిర్మాతలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారట.