తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ఈ నేపథ్యంలోనే ఇటీవల ధమాకా సినిమా( Dhamaka movie )తో ప్రేక్షకులను ప్రేక్షకులను పలకరించిన రవితేజ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయినా రావణాసుర సినిమా( Ravanasura movie ) షూటింగ్లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రావణాసుర.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోయింది.ఇలా ఉంటే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
డిక్కా.డిశుమ్ అంటూ సాగే ఫుల్ జోష్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.
కాగా ఈ రావణాసుర సినిమా ఏప్రిల్ 7, 2023న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే రవితేజ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ క్షణం తిరిగి లేకుండా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ తన కొడుకు ఎంట్రీ గురించి స్పందించాడు.రవితేజ కొడుకు పేరు మహాధన్( Mahadhan ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.రవితేజకు ఇద్దరూ పిల్లలు కాగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి.ఇప్పటికే రవితేజ కొడుకు మహాధన్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ గా నటించి మెప్పించాడు.ఇంటర్వ్యూలో భాగంగా మాస్ మహారాజ్ ని చూశాం.
నెక్స్ట్ మాస్ మహారాజ్ మహాధన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.రవితేజ తెలియదు.
అస్సలు ఐడియా కూడా లేదు.అసలు నాకు సంబంధం కూడా లేదు.
వాడు ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు.
ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు ఇంట్రెస్ట్ ఉంది.కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు.
ఇండస్ట్రీకి వాడు వస్తానంటే వెళ్ళు అని చెప్తాను.ఒక్క సలహా కూడా ఇవ్వను.
వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేసాను వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు.వాడి గురించి నేను చెప్పడం కాదు మీరు తెలుసుకోవాలి ఒకరి గురించి ఒకరు ఒప్పుకోకూడదు అని తెలిపారు రవితేజ.








