ఖిలాడి కూడా మొదలెట్టాడోచ్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టాలని కసిగా చూస్తున్నాడు రవితేజ.

కాగా ఈ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు చిత్ర వర్గాల్లో కూడా అదిరిపోయే అంచాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లకు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ సినిమాను రమేష్ వర్మ డైరెక్షన్‌లో ప్రారంభించాడు.ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇటీవల చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని రవితేజ భావిస్తున్నాడు.

Advertisement

కాగా గతంలో ఈ డైరెక్టర్‌తో కలిసి చేసిన ‘వీర’ చిత్రం యావరేజ్ మూవీగా నిలవడంతో, ఈసారి తమ కాంబో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు చిత్ర యూనిట్.

ప్రస్తుతం మిగతా హీరోలు తమ సినిమాలకు సంబంధించి వాయిదా పడ్డ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకే భయపడుతుంటే, రవితేజ మాత్రం ఏకంగా కొత్త సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు.ఇక హవీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు