హాస్యాన్ని పండిస్తూ హీరోయిజం మారుపేరుగా మారి.తన నటనతో ప్రేక్షకుల్లో కిక్ ను పుట్టిస్తు తనపేరును సుస్థిరం పరుచుకున్న హీరో రాజాది రాజా.
మాస్ మహారాజా.రవితేజసొంతంగా .అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన స్థానాన్ని పదిలంపరుచుకున్న నటులలో రవితేజ ఒకరు.మొదట్లో అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు నటించిన గుర్తింపు లేదు, దర్శకుడు కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటిచాడు రవితేజ, కానీ ప్రజల్లోకి బ్రహ్మాజీ కంటే రవితేజ పాత్ర జనాల్లోకి విపరీతంగా వెల్లిపోయింది.
సింధూరం సినిమాతో రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది.క్లాస్ సినిమాలు చెయ్యాలన్నా , మాస్ మూవీస్ చేయాలన్నా మాస్ మహారాజ్ రవితేజ మార్క్ పక్కాగా ఉండాలసిందే రవితేజ ఎనర్జీ , టైమింగ్ , కామెడీ ,తన టైమింగ్ , మాస్ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకులు రవితేజ సినిమాని మరో లెవెల్ కు తీసుకొని వెళతారు , అదే మూవీ లో రవితేజ టైమింగ్ , కామెడీ , ఎనర్జీ , మాస్ ఎలిమెంట్స్ మిస్ అయితే మాత్రం మూవీ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ ఫైర్ అవుతుంది .
ఇక రొటీన్‌కు భిన్నమైన, కొంచెం కొత్తగా అనిపించే, క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ ఉన్నా కొన్ని కొన్ని సార్లు మాస్ మహారాజ్ కు టైమ్ అసలు కలిసి రావడం లేదు .మాస్ మాహారాజ్ రవితేజ సినీ కెరీర్ లో రీమేక్ సినిమాలు చేసినప్పటికీ ,ఒక్కో సారి ఆ రీమేక్ సినిమాలు మాస్ మహారాజ్ అభిమానులకు సినిమా నచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి .ఇక రవితేజ తన సినిమా ఫెయిల్ అయిన ప్రతి సారీ మళ్లీ ఒక డిఫరెంట్ సినిమా చేస్తూనే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు .ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం మరో సారి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే .టాలీవుడ్ లో ఎక్స్పెరిమెంటల్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో రవితేజ ఒక క్రేజీ సినిమా చేయబోతున్నతలు ఒక సోషల్ మీడియా లో ఒక క్రేజీ వార్త వినిపిస్తోంది .’అ!’ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన డైరెక్టర్ ప్రశాంత్.ఆ తర్వాత ‘జార్జిరెడ్డి’, ‘హనుమాన్’ సినిమాలు తీశాడు.‘జార్జిరెడ్డి‘ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది ఇక ‘హనుమాన్‘ మూవీ మంచి హైప్ తెచ్చుకుంది.దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడం కోసం మంచి కధ రెడీ చేసుకుంటున్నాడు .

ప్రస్తుతం బాలయ్యఉన్న కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది .హనుమాన్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయి రిలీజ్ కు రెడీ గా ఉంది .ఇక బాలకృష్ణ తో సినిమా చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు రవితేజకు ఒక కథ చెప్పి ఒకే చెప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ప్రశాంత్ సినిమా అంటే కొంచెం డిఫరెంట్‌గా, మంచి కాన్సెప్ట్ తో క్రేజీగా ఉంటుంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఆగాలసిందే .







