ఏపీలో రాజకీయ వేడిని పెంచుతున్న జీవో నెంబర్.1పై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.జీవో నెంబర్.1 ను కొనసాగిస్తారా లేదా పూర్తిగా నిషేధిస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్.1ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ జీవోపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా… ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.ఈ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచే విచారణ చేస్తుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జీవోపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది.







