సినిమా సినిమాకి హీరో మార్కెట్ పెరగాలి.మళ్ళి ఇప్పుడు టికెట్ రేట్స్ కుడా చాల చోట్లా పెంచారు.
రవితేజ కిక్-2 మాత్రం భిన్నంగా కదులుతోంది.
కిక్ అనే బ్రాండ్ చాలా మైనస్ అయిందని అంటున్నాడు సగటు సిని ప్రేక్షకుడు.
కిక్ బ్రాండ్ వాళ్ళ అంచానాలు ఎక్కడికో వెళ్ళాయి.సినిమాలో కిక్ లో ఉన్నంత సరుకు లేకపోవడం వల్ల ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడుతున్నట్టు కనిపిస్తోంది.
ఏదైనా కొత్త పేరుతొ వచ్చి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.అంచనాలతో వెళ్ళకుండా సంతృప్తి చెందేవారేమో.
నైజాం లో పవర్ మొదటి రోజు 2 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే, అంతకన్నా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయిన కిక్-2 మాత్రం కేవలం 1.86 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంట.ఒంగోల్ లాంటి చిన్న సెంటర్ల విషయానికొస్తే .పవర్ తొలిరోజు 100 రూపాయల టికెట్ తో 5 లక్షలు వసూలు చేస్తే, 120 రూపాయల టికెట్ రేట్ తో కిక్-2 కేవలం 4.6 లక్షలు కలెక్ట్ చేసింది.
అసలే నష్టాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి కిక్-2 మరో ఎదురుదెబ్బ కానుందా ?