Ravi Teja Dhamaka : 'ధమాకా'లో అది అస్సలు మిస్ అవ్వరు.. మాస్ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకునే వారు.కానీ ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.

 Raviteja Intresting Comments On Dhamaka Movie, Ravi Teja, Dhamaka Movie, Sreelee-TeluguStop.com

దీంతో ఈయన కెరీర్ కు ప్రెజెంట్ రిలీజ్ చేయబోయే సినిమా కీలకం కానుంది.ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.

ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు.డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దీంతో మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి.

ధమాకా తో సక్సెస్ అందుకుంటాడా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుసగా ప్రొమోషన్స్ చేయడం స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే పాటలు రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయ్యాయి.ఇక తాజాగా మాస్ రాజా రవితేజ తాజాగా ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఈయన ఈ సినిమా గురించి చెప్పుకొస్తూ.తన కామెడీ టైమింగ్ అభిమానులు చాలా మిస్ అవుతున్నారని.

ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్, మాస్ స్టెప్స్ తో అదిరిపోతోంది అని తెలిపాడు.

Telugu Dhamaka, Trinadharao, Ravi Teja, Raviteja, Sreeleela-Movie

అలాగే ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని.ఇటీవల సినిమాల్లో టైమింగ్ మిస్ అవుతుందని.అభిమానులలో విశ్వాసాన్ని నింపాడు.

ఈ సినిమాలో తనకు జింతాక్ సాంగ్ ఇష్టం అని ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చాడు.దీంతో ఈ సినిమాపై రవితేజతో పాటు టీమ్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Dhamaka, Trinadharao, Ravi Teja, Raviteja, Sreeleela-Movie

ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.అలాగే రవితేజ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube