భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja )అంతర్జాతీయ క్రికెట్ లో ఓ అరుదైన రికార్డ్ సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా ఓ అరుదైన ఘనత అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆరవ భారత బౌలర్ గా నిలిచాడు.ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జానీ బెయిర్ స్టో ను అవుట్ చేసి ఈ ఘనత సాధించాడు.

రవీంద్ర జడేజా అన్ని ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచులు ఆడి 552 వికెట్లు తీశాడు. భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును బ్రేక్ చేశాడు.జవగళ్ శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్ లో 551 వికెట్లు పడగొట్టిన రికార్డ్ ను రవీంద్ర జడేజా తాజాగా బ్రేక్ చేసేసాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అనిల్ కుంబ్లే( Anil Kumble ) తొలి స్థానంలో ఉన్నాడు.అనిల్ కుంబ్లే 953 వికెట్లు పడగొట్టాడు.ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) 723 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
భారత మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ 707 వికెట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.కపిల్ దేవ్ 687 వికెట్లతో నాలుగవ స్థానంలో, జహీర్ ఖాన్ 597 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
ఇక తాజాగా జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే.ఇంగ్లాండ్ జట్టు 200 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్ పోప్ 180 పరుగులతో క్రీజులో ఉన్నాడు.భారత జట్టు చేజింగ్ సులభం కావాలంటే పోప్ ను భారత బౌలర్లు తొందరగా పెవిలియన్ చేర్చాలి.
ప్రస్తుత ఇంగ్లాండ్ స్కోరు 390/7 గా ఉంది.








