వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్-వెస్టిండీస్ ( India-West Indies )మధ్య జరుగతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు వెటర్న్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ).వెస్టిండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించి పెవిలియన్ కు చేర్చాడు.
ఏకంగా ఐదు వికెట్లు తీసి వెస్టిండీస్ పతనానికి కారణం అయ్యాడు.టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
అయితే వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ 20, త్యాగ్ నారాయణ్ చందర్ పాల్ 12, అలిక్ అథానాజ్ 47, అల్జారీ జోసెఫ్ 4, జోమెల్ వారికన్ 1 పరుగులు చేసి అశ్విన్ చేతిలో అవుట్ అయ్యి పెవిలియన్ చేరారు.

అయితే ఈ టెస్ట్ మ్యాచ్ తో పలు సరికొత్త రికార్డులు రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో పడ్డాయి అవేమిటో చూద్దాం.భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు బౌల్డ్ చేసిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానానికి చేరుకున్నాడు.రవిచంద్రన్ అశ్విన్ 95 సార్లు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేశాడు.
రెండవ స్థానంలో భారత గజ స్పిన్నర్ అనిల్ కుమ్మే( Anil Kumme ) 94 సార్లు బౌల్డ్ చేశాడు.ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్( Kapil Dev ) 88 తో మూడో స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానంలో మహమ్మద్ షమీ 66 తో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన రవిచంద్రన్ మూడవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.మొదటి స్థానంలో అనిల్ కుంబ్లే 953, రెండవ స్థానంలో హర్భజన్ సింగ్ 707 ఉన్నాడు.టెస్ట్ క్రికెట్ లో తండ్రి, కొడుకును అవుట్ చేసిన ఐదో బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.త్యాగ్ నారాయణ్ చందర్ పాల్ ను బౌల్డ్ చేయడంతో ఈ అరుదైన ఘనత సాధించాడు.2011లో త్యాగ్ నారాయణ్ తండ్రి శివ్ నారాయణ్ ను అవుట్ చేశాడు.టెస్ట్ క్రికెట్ లో రవిచంద్రన్ అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం ఇది 33 వ సారి.ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 67తో అగ్రస్థానంలో ఉన్నాడు.