టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన క్రాక్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.గత కొన్ని రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు క్రాక్ సినిమాతో విజయం సాధించాడు అనుకునేలోపు ఖిలాడీ సినిమాతో మరొక ప్లాప్ చవిచూశాడు.
అయినా కూడా ఈయన స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.
ప్రెసెంట్ రవితేజ చేస్తున్న సినిమాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి.
శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ముందు నుండి ప్రమోషన్స్ పరంగా దూకుడుగా వ్యవహరిస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతూ వస్తున్న టీమ్ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమా ఈ ఏడాది జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఈ మేరకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఇందులో రవితేజ సీరియస్ గా కనిపిస్తున్నాడు .అలాగే బ్యాగ్ గ్రౌండ్ లో భారీ వాహనాలు అడవి గుండా వెళ్తున్నట్టు ఈ పోస్టర్ ద్వారా చూపించారు.మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా భాగం అయ్యారు.చాలా రోజుల తర్వాత వేణు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించ బోతున్నాడు.అలాగే ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.హై వోల్టాజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండగా.
సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.







