మాస్ మహారాజా రవితేజ ( Raviteja ) ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswar Rao ) సినిమాతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ప్రస్తుతం రవితేజ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.
అందులో ”ఈగల్” ( Eagle Movie ) ఒకటి.యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా టీజర్ తో అంచనాలు భారీగా పెంచేశారు.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ), కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.

సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న గ్రాండ్ గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టుకుని మెల్లమెల్లగా అంచనాలు పెంచేసుకుంది.ఇటీవలే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ పెంచేశారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి రన్ టైం లాక్ అయినట్టు బయటకు వచ్చింది.

ఈ సినిమా రన్ టైం 2 గంటల 10 నిముషాలు ఉన్నట్టు లేటెస్ట్ సమాచారం.మరి ఇది మంచి రన్ టైం అనే చెప్పాలి.ఒకరకంగా ఈ రన్ టైం సినిమాకు కూడా ప్లస్ అయినట్టే అని చెప్పాలి.మరి రన్ టైం విషయంలో మేకర్స్ నుండి అధికారిక అప్డేట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.
మరి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తన మార్క్ హిట్ కొట్టలేక పోయిన రవితేజ ఈగల్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.






