ఆ సినిమా కోసం నో కాంప్రమైజ్ అంటున్న మాస్ రాజా.. బిగ్గెస్ట్ హిట్ కోసం హార్డ్ వర్క్!

మాస్ మహా రాజా రవితేజ మరింత జోష్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ వాటిని పూర్తి కూడా చేస్తున్నాడు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టాడు.

 Ravi Teja Plan Tiger Nageswara Rao For The Biggest Hit, Director Vamsi Krishna ,-TeluguStop.com

అయితే క్రాక్ తర్వాత రెండు సినిమాలు రిలీజ్ అయినా అంతగా ఆకట్టుకోలేక పోయాడు.ఖిలాడీ దెబ్బతో రామారావు ఆన్ డ్యూటీ బిజినెస్ లెక్కలు మారిపోయాయి.

ఇలా రెండు సినిమాలు రిలీజ్ అయితే రెండు కూడా ప్లాప్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ధమాకా సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇటీవలే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ వరుసలో రావణాసుర ఉంది.అసలు ఇంత వరకు ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.

దీంతో ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమాల్లో అంచనాలు బాగా ఉన్న సినిమా అంటే టైగర్ నాగేశ్వరరావు అనే చెప్పాలి.

వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కుతుంది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు భాగం అయ్యారు.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు అప్పట్లో పోలీసులను ఎన్ని తిప్పలు పెట్టారో చూపించ బోతున్నారు.ఇక ఈ సినిమా కోసం రవితేజ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని.తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలపాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

Telugu Vamsi Krishna, Raviteja, Tigernageswara-Movie

మాములుగా అయితే రవితేజ ఒక్కసారి కథ ఓకే చేస్తే మళ్ళీ సినిమా పూర్తి అయ్యే వరకు పెద్దగా పట్టించుకోరట.కానీ ఈ సినిమాకు మాత్రం ప్రతీ చిన్న సీన్ కూడా డైరెక్టర్ తో చర్చించి ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళుతున్నాడు అని తెలుస్తుంది.మరి రవితేజ కోరుకుంటున్నట్టు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అయిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించ నున్నారు.ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తుండగా రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube