వివాదాస్పద అంశంతో రవితేజ - మలినేని మూవీ.. రిస్క్ తప్పదా?

మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కాంబో మరోసారి అఫిషియల్ అయ్యింది.ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది అని నిన్న అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది.

 Ravi Teja - Gopichand Malineni Movie Update, Ravi Teja, Gopichand Malineni, Tol-TeluguStop.com

గత కొద్దీ రోజులుగా ఈ కాంబోలో మరో మూవీ ఉంటుంది అని వార్తలు రాగా ఎట్టకేలకు మేకర్స్ ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రకటించే సమయంలో వదిలిన పోస్టర్ తో కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుని అనే టాక్ నెట్టింట వైరల్ అయ్యింది. గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) క్రాక్ సినిమా సమయంలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించారు.

Telugu Guntur, Ravi Teja, Raviteja, Tollywood-Movie

ఆ తర్వాత బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి సినిమా సమయంలో కూడా వేటపాలెంలోని వందేళ్ల చరిత్ర ఉన్న లైబ్రరీని సందర్శించి సమాచారం సేకరించాడు.ఇక ఇప్పుడు గోపీచంద్ రవితేజతో తీయబోతున్న కొత్త సినిమాకు యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారని ఈసారి కాస్త వివాదాస్పద అంశాన్నే టచ్ చేయనున్నాడు అని టాక్.మరి ఆ వివాదాస్పద అంశం ఏంటంటే చుండూరు అంశం.గుంటూరు జిల్లా( Guntur District )లో ఉన్న ఈ ప్రాంతం గురించి చాలా మందికి తెలుసు.ఒకప్పుడు దళితుల్ని ఊచకోత కోసిన ప్రదేశంగా ఈ ప్రాంతం నిలిచి పోయింది.గత 32 ఏళ్ల క్రితం 300 మంది అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు దళితులపై విచక్షణ రహితంగా దాడి చేసి క్రూరంగా 8 మందిని హత్య చేసారు.

ఈ చుండూరు అంశం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది.

Telugu Guntur, Ravi Teja, Raviteja, Tollywood-Movie

మరి ఇదే అంశాన్ని గోపీచంద్ రవితేజ( Ravi Teja ) సినిమా కోసం వాడుతున్నారని అనౌన్స్ మెంట్ పోస్టర్ ను బట్టి చెబుతున్నారు.మరి ఇదే నిజమైతే గోపీచంద్ ఈసారి వివాదాస్పద అంశాన్ని టచ్ చేయబోతున్నట్టే తెలుస్తుంది.ఇది పెద్ద రిస్క్ అయినప్పటికీ ఇప్పటి ప్రేక్షకులు ఇలాంటి యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.

వాటిని సూపర్ హిట్ గా నిలబెడుతున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

కాగా మైత్రి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube