మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) గోపీచంద్ మలినేని కాంబో మరోసారి అఫిషియల్ అయ్యింది.గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త మూవీ ఇటీవలే అనౌన్స్ చేసారు.
మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
div class=”middlecontentim
ఇక ఇప్పుడు ఒక్కొక్క పని పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది.తాజా టాక్ ప్రకారం హీరోయిన్ ఎంపికపై వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.మాస్ రాజా సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డేను( Pooja Hegde ) సెట్ చేయాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.మరి ఈ క్రమంలోనే టీమ్ ఇటీవలే పూజాను సంప్రదించినట్టు తెలుస్తుంది.
అన్ని కుదిరితే ఈసారి బుట్టబొమ్మ మాస్ రాజాతో రొమాన్స్ చేయడం ఖాయం అంటున్నారు.అయితే అందుకు పూజా హెగ్డే ఒప్పుకోవాలి.మరి పూజా తన పాత్ర నచ్చితే ఓకే లేకపోతే నో చెప్పే అవకాశం ఉంది.ఇక ఈ కాంబో ఇప్పటికే మూడుసార్లు రాగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇకఇప్పుడు క్రాక్ తర్వాత మరో సినిమాతో వీరు కలిసి పని చేయనున్నారు.ఇక రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు చేస్తుండగా ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.
అలాగే ఇటీవలే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమా ( Eagle Movie )ప్రకటించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.
అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.చూడాలి మరి షూట్ గురించిన అప్డేట్ ఎప్పుడు అందిస్తారో.