ధమాకా హిట్ తో ఆ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రాబోతున్నాయట

రవితేజ చాలా కాలం తర్వాత ధమాకా సినిమా తో సక్సెస్ ని సొంతం చేస్తున్నాడు.రవితేజ చిత్రం ధమాకా రూ.

100 కోట్ల క్లబ్ లో చేరబోతుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్‌ సాధించిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ కి మరో 5 సంవత్సరాలకు సరిపోయేంత బూస్ట్ ఇచ్చిందంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రవితేజ తదుపరి సినిమాల విషయానికి వస్తే టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ధమాకా సినిమా సక్సెస్ అయ్యింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.రావణాసుర సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది, అతి త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమా యొక్క కీలక అప్డేట్ ని ఇవ్వబోతున్నారు.

రావణాసుర సినిమా లో జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటించడం తో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించడం వల్ల సినిమా స్థాయి అంతం పెరిగింది.

Advertisement

ఈ రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా రవితేజ కి సక్సెస్ ని తెచ్చిపెడతాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

ధమాకా సినిమా తో సక్సెస్ సొంతం చేసుకున్న రవితేజ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెండు సినిమాలను కూడా 2023లోనే విడుదల చేయాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.రవితేజ మరింత కష్టపడి స్పీడ్ గా రెండు సినిమాలను పూర్తి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.మరి రవితేజ ప్లాన్ ఏంటి అనేది అధికారికంగా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రవితేజ మరో రెండు విజయాలను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన రెమ్యూనరేషన్ అమాంతం పెరగడం ఖాయం.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు