మాస్ మహారాజా కెరీర్ లో ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.
ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.
ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మరొక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడని సమాచారం.ఈ వార్త గతంలో వచ్చింది కానీ దీనిపై క్లారిటీ ఇప్పుడు వచ్చింది.
ఈ సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఈయన ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర ఫుల్ ఫన్ తో నవ్వులు పంచుతుందని.రవితేజ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ బెస్ట్ కామెడీ సీక్వెన్స్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.అలాగే రవితేజ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో వరుసగా నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తర్వాత స్పెయిన్ కూడా చుట్టేసి వచ్చారు.

ఇక ఈ సినిమాతో పాటు మాస్ రాజా శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ , వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలు చేస్తున్నాడు.ఇందులో రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కు రెడీగా ఉండగా.మిగతా రెండు సినిమాలు షూటింగ్ జరుపు కుంటున్నాయి.మరి వీటిలో ఏ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.







