మళ్లీ గొడవ పడిన రవి లాస్య.. దరిద్రంగా పుట్టిందంటూ..?

ప్రస్తుతం బుల్లితెరపై ఇమ్మాన్యుయేల్ వర్ష, సుధీర్ రష్మీ జోడీలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఒకప్పుడు రవిలాస్య జోడీకి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉండేది.

టామ్ అండ్ జెర్రీలా ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు, లాస్య చెప్పే చీమఏనుగు జోక్ లు ఆ షోలు సక్సెస్ కావడానికి కారణమయ్యాయి.

అయితే కొన్ని కారణాల వల్ల రవిలాస్య జోడీ విడిపోవడంతో పాటు ఒక ఇంటర్వ్యూలో లాస్య మాట్లాడుతూ రవిపై కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే పెళ్లి తరువాత టీవీ షోలకు దూరంగా ఉన్న లాస్య గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఆ తరువాత సంక్రాంతి పండుగకు ప్రసరామైన ఒక ఈవెంట్ లో పాల్గొని రవిలాస్య సందడి చేశారు.పాత గొడవలను మరిచిపోయి ఈ జోడీ తాజాగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కోసం ఒక స్కిట్ చేయగా ఆ స్కిట్ ప్రోమోలో లాస్య రవి ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ నవ్వించారు.

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉప్పెన సినిమాకు రవిలాస్య స్పూఫ్ చేశారు.రవి అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారంటరా.వీళ్ల బాబు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదేమో ఇంత దరిద్రంగా పుట్టిందంటూ లాస్యపై పంచ్ వేశారు.

Advertisement

ఆ తరువాత తాను ఉప్పెన బేబమ్మ అని లాస్య చెప్పగా మా ఇంటి పక్కన పెద్దమ్మలా ఉంటుందని అన్నారు.ఆ తరువాత ఇక్కడ అర ఎకరం, ఇక్కడ అర ఎకరం అంటూ అర ఎకరం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలంటూ రవికి కూడా జుట్టు రాలిపోయిందంటూ లాస్య పంచ్ వేసుకుంటూ సరదాగా గొడవ పడ్డారు.

ఆ తరువాత జ్వరం కావాలా ఈ సూది వేస్తే జ్వరం, దగ్గు, జలుబు అన్నీ వచ్చేస్తాయంటూ లాస్య పంచ్ వేస్తుంది.ఉప్పెన మూవీలోని జలజలజలపాతం నువ్వు పాటకు రవిలాస్య అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

Advertisement

తాజా వార్తలు