జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల లో జనసేన పార్టీ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.ఆ పార్టీ ఓటమి తో ఒక్కొక్కరు గా అందరూ బయటకు వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది.

 Ravela Kishor Babu Is Resigned To Janasenaparty-TeluguStop.com

మొన్న జరిగిన సమీక్ష కు నాదెండ్ల మనోహర్,జేడీ లక్ష్మి నారాయణ గారు హాజరు కాకపోవడం తో వారు త్వరలో పార్టీ ని వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు తాజాగా ఆ పార్టీ తో చాలా సన్నిహితంగా మెలిగిన రావెల కిషోర్ బాబు ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత కు లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.

రైల్వే స‌ర్వీసుల‌కు చెందిన రావెల 2014 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా టీడీపీలో టిక్కెట్ ద‌క్కించుకొని ఆ ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బాబు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

-Telugu Political News

ఆయ‌న‌కు సాంఘిక సంక్షేమ శాఖ అప్ప‌గించగా, మూడేళ్ల త‌రువాత కేబినెట్ పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా గుంటూరు జిల్లా నుండి మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబును త‌ప్పించి న‌క్కా ఆనంద బాబుకు చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.దీంతో అసంతృప్తి గా ఉన్న రావెల ఎన్నికల ముందు పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరారు.అనంతరం ప్రచార సమయంలో ఇతర పనులలో పవన్ తో ఎంతో సన్నిహితంగా మెలిగారు.

అయితే ఇప్పుడు తాజాగా కొన్ని వక్తిగత కారణాల వల్ల పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు లేఖ ను జనసేన అధినేత పవన్ కు పంపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube